– శాశ్వతమైన ఒప్పందం వైపే మొగ్గు
– ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఏప్రిల్ 15 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని, శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణను పునరుద్ధరించకుండానే అవి ముగిసే అవకాశముందని తెలిపారు. చర్చలు ఏవిధంగా ముగిసినప్పటికీ ఇరాన్‌తో ఒప్పందం కుదిరితేనే అందరికీ మంచిదన్నారు. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈనెల 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా శాశ్వత శాంతిఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లో మరోసారి ఇరాన్ అధికారులతో సమావేశమవనున్నట్లు తెలిపారు. రెండో విడత చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. గతంలో ఇరాన్‌లో ఉన్న అతివాద శక్తులు పోయి ప్రస్తుతం కొత్త పాలన నెలకొందన్నారు. కొత్త పాలకుతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.రు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు.




