– ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 15 : ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమం కొత్త మైనింగ్ ఆలోచనలకు వేదిక అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆత్మనిర్భర భారత్ భవిష్యత్తులో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషించనుందన్నారు. దిల్లీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2047 విజన్ సాధనలో మైనింగ్ సంస్కరణలు మార్గనిర్దేశకమని, జాతీయ-అంతర్జాతీయ నిపుణులు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, శోధనా సంస్థలు కలిసి పంచుకునే వేదికగా ఇది నిలుస్తుందని తెలిపారు. గత 12 ఏళ్ళలో పారదర్శకత పెరిగి సుమారు 700 మైనింగ్ బ్లాక్‌ల వేలాలు పూర్తయినట్లు, ఇందులో 56 క్రిటికల్ మినరల్ బ్లాక్‌లు ఉన్నాయని, కమర్షియల్ కోల్ మైనింగ్ ద్వారా 132 బొగ్గు గనుల వేలాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మైనింగ్‌లో ఏఐ, డ్రోన్‌లు, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ, రీసైక్లింగ్ ద్వారా క్రిటికల్ మినరల్స్ వెలికితీయడంతో భారత్ ముందంజలో ఉందని చెప్పారు. గనుల శాస్త్రీయ మూసివేతకు ప్రాధాన్యత ఇస్తున్నాం; ఇప్పటి వరకు 42 బొగ్గు గనులు మూసివేశామన్నారు. ఇండియా మైనింగ్ వీక్ 2026 ద్వారా భారత మైనింగ్ రంగం ప్రపంచానికి పరిచయం అవుతుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





