దేశంలో ఎక్కడా సన్న బియ్యం పంపిణీ లేదు

– 89 లక్షల కార్డులను 2.80 కోట్లకు చేర్చాం
– బీఆర్‌ఎస్‌ ‌నేతలు తప్పుడు ప్రచారాలు మానాలు
– సంగారెడ్డి సభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

=సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌ రాష్ట్రంలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్త స్మార్ట్ ‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడుతూ 3.42 కోట్ల మందికి రూ.14800 కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బిఆర్‌ఎస్‌  ‌ప్రభుత్వంలో 89 లక్షల రేషన్‌ ‌కార్డులు ఉంటే.. వాటిని 2.80 కోట్లకు పెంచామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల మంజూరు.. నిరంతర పక్రియ అని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీలోని నేతలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల నుంచి చుక్క నీరు తీసుకోకుండా దేశంలోనే ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణలో పండించామన్నారు. వరి కొనుగోళ్లలో రూ.90 వేల కోట్లు.. రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు రేషన్‌ ‌కార్డుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని వెల్లడించారు. కొత్తగా 16 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు ఇచ్చామని అన్నారు.గ‌త ప్ర‌భుత్వ‌ హయాంలో రేషన్‌ ‌కింద దొడ్డు బియ్యం ఇచ్చారని.. అప్పుడు ఆ బియ్యాన్ని ఎవరూ తినకుండా కిలో రూ.10కి అమ్ముకునే వారని తెలిపారు. కాంగ్రెస్‌ ‌వచ్చాక సన్న వడ్లకి రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసి వాటినే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నాణ్యత ఉన్న సన్న బియ్యాన్ని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పంపిణీ చేస్తోందని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు చరిత్రలో పండుగలా గుర్తుండిపోతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కొత్త రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక 16 లక్షల కొత్త కార్డులు ఇచ్చాం. గతంలో రేషన్‌లో దొడ్డు బియ్యం వచ్చేవి. ఆ బియ్యాన్ని 80 శాతం మంది తినేవారు కాదు. కానీ, కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌వచ్చాక సన్నబియ్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చి కొంటున్నాం. మనిషికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇవ్వడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి అర్హతలను పరిశీలించి కార్డులు ఇస్తాం అని ఉత్తమ్‌ ‌తెలిపారు. స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డు అంటే కుటుంబానికి గౌరవమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డు అంటే ఆహార భద్రత, ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని, నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *