ఒక్కొక్కరు

అమరత్వం ముద్దాడి

మళ్లీ

చిరునవ్వులవుతున్నారు.

 

చూడు

ఉషోదయ రెక్కల మీద

చరిత రాసుకుంటున్న మానవజాతి

పరిమళ కథలు.

 

వారు

ఎప్పటికీ ఆకాశ నిండైన తారలు

 

కవిత్వానికి దొరకని

భాషా నిఘంటువులు

 

తిరిగి

తిరిగి

చిగురిస్తున్న

నిప్పుల వాన మొలకలు.

-జనజ్వాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *