– పూర్తిగా మా ఆధీనంలోనే ఉండేలా చర్యలు
– ఐఆర్‌జీసీ కీలక ప్రకటన
టెహ్రాన్, మే 2 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హర్మూజ్ జలసంధి మార్గాలపై తమ నియంత్రణను బలోపేతం చేసే ఉద్దేశంతో ఐఆర్‌జీసీ కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్టు ఇరాన్ ప్రభుత్వ విÖడియా పేర్కొంది. అరేబియా గల్ఫ్, హర్మూజ్ జలసంధి మీదుగా విస్తరించి ఉన్న దాదాపు రెండు వేల కిలోమీటర్ల ఇరాన్ తీర ప్రాంతంపై తమ పర్యవేక్షణ ఉంటుందని ఐఆర్‌జీసీ నావికా దళ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గంలో రవాణాపై త్వరలోనే కొత్త నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు. తమ చర్యలు ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ఉంటాయన్నారు. సముద్ర భద్రతను బలోపేతం చేయడం, విదేశీ జోక్యాన్ని తగ్గించడం, ప్రాంతీయ నియంత్రణను పెంచడం, వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలో ఉంచడమే ఆ నిబంధనల లక్ష్యాలని తెలిపారు. హోర్ముజ్ జలాలు భద్రత, అభివృద్ధికి మÖలంగా మారాలని తాము కోరుకుంటున్నట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. కాగా, ’పర్షియన్ గల్ఫ్ నీలి జలాల కేంద్రం మాత్రమే కాదు.. అది మన గుర్తింపు.. మన నాగరికతలో ఒక భాగం.. ప్రపంచ దేశాల మధ్య అనుసంధాన కేంద్రం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మార్గం’ అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. పర్షియన్ గల్ఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్న విదేశీ బలగాలకు ఇది ఓ హెచ్చరికగా చూడాలి.. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి విషయంలో కొత్త అధ్యాయం మొదలుకానుందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఆర్‌జీసీ నౌకాదళ విభాగం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సవిÖకరణాలు, నిబంధనలు సిద్ధమయ్యాయని, సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగా వాటిని అమలు చేస్తామని వెల్లడించింది. ఇరాన్ ప్రజల శక్తిసామర్థ్యాలు, గొప్పతనానికి ప్రతీకగా, జీవనోపాధి, ప్రాంతీయ భద్రతకు ఆధారంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐఆర్‌జీసీ నౌకాదళం ప్రకటించినట్లు ఇరాన్ అధికారిక విÖడియా ’ప్రెస్ టీవీ’ తెలిపింది. మరోవై|పు హర్మూజ్‌లో అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 42 నౌకలను అడ్డుకున్నామని యÖఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ ఓ సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కీలక జలమార్గంపై ఇరాన్ అధికారం, నిర్వహణ అంశాలను అందులో ప్రస్తావించారు. జలసంధి నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరాన్ రియాల్స్‌లో వసూలు చేయడం, ఇరాన్‌పై ఆంక్షలు విధించిన, దురాగతాలకు పాల్పడిన దేశాల నౌకలు పరిహారం చెల్లించేలా చూడటం, నౌకల రాకపోకలను తమ సైనికులే నియంత్రించేలా చూడటం వంటివి ప్రణాళికలో ఉన్నాయి.
———————————————————————
ఇరాన్ ప్రతిపాదనలు నచ్చలేదు : ట్రంప్
వాషింగ్టన్, మే 2 : పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చల విషయంలో మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ ద్వారా ఇరాన్ పంపిన ప్రతిపాదన తనకు నచ్చలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ’ఇరాన్ ప్రతిపాదన అంగీకరించదగిన స్థాయిలో లేదు. ఒప్పందం సాధ్యమవుతుందో లేదో చెప్పడం కష్టం’ అని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. దీంతో ఇరాన్`అమెరికా మధ్య చర్చలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, నౌకా దిగ్బంధనం తొలగించాలని ఇరాన్ అడుగుతోంది. అలాగే అణు కార్యక్రమం గురించి ఇప్పటికప్ప్పుడు ఒక ఒప్పందానికి రాకూడదని భావిస్తోంది. అమెరికా మాత్రం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలపై ముందుకు వెళ్లాలని అనుకుంటోంది. అణు కార్యక్రమం విషయంలో పూర్లి స్పష్టత కావాలని, అలాగే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, అప్పటివరకు నౌకా దిగ్బంధనస్త్ర కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. ’ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలను కూడా పరిశీలించాల్సి వస్తుంది’ అని ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సైనిక చర్యలకు దిగే అవకాశాలున్నాయని సంకేతాలు ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



