ప్రమాదంలో పత్రిక స్వేచ్ఛా..

“ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం 157వ స్థానంలో నిలిచింది. 2025లో నివేదికలో భారతదేశం 151వ స్థానంలో ఉంటే, ప్రస్తుతం ర్యాంకింగ్‌లో ఆరు స్థానాలు దిగజారి 157 స్థానానికి పడిపోయింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చరిత్రలో తక్కువగా ఉందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది.2001 నుండి మీడియాపై ప్రభుత్వాలు కఠినంగా అణిచివేసే చట్టాలను విస్తరణ విస్తరించడం, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించినవింటూ భారత్‌, యూఎస్‌ వంటి ప్రజాస్వామ్య దేశాలలో కూడా సమాచార హక్కును క్రమంగా క్షీణింపజేస్తోంది.”

కలం కుతికెలపై సర్కార్‌ కత్తులు..!!
ప్రపంచవ్యాప్తంగా ధిక్కార స్వరాన్ని అణిచివేసే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. మతోన్మాదం, యుద్దోన్మాదం, నియంతృత్వంతో భావప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడుతోంది. ఘనమైన పురాతన ప్రజాస్వామ్యాలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు చెప్పుకునే కంట్రీస్‌లో ప్రజల వాక్‌ మరియు భావప్రకటన స్వేచ్చను హరిస్తున్నాయి.
.తాజాగా ఏప్రిల్ 30న రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో ప్రజాస్వామ్య దేశాల మేడిపండు కథ బయటపడింది. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఆర్ఎస్ఎఫ్ ) ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో పత్రిక స్వేచ్చ, ఫ్రీ డమ్ ఆఫ్ ఎక్స్‌ప్రేషన్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారత ప్రభుత్వం పత్రిక స్వేచ్చను ఎలా హరిస్తుందో, ఫ్రీ డమ్ ఆఫ్ ఎక్స్‌ ప్రేషన్‌ను అణిచివేస్తోందో నివేదికలో బయటపడింది. దేశంలో మీడియా స్వేచ్ఛ అనేది మేడిపండు అన్నది మరోసారి స్పష్టమైంది.
.ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం 157వ స్థానంలో నిలిచింది. 2025లో నివేదికలో భారతదేశం 151వ స్థానంలో ఉంటే, ప్రస్తుతం ర్యాంకింగ్‌లో ఆరు స్థానాలు దిగజారి 157 స్థానానికి పడిపోయింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చరిత్రలో తక్కువగా ఉందని  ఆర్ఎస్ఎఫ్   పేర్కొంది.2001 నుండి మీడియాపై ప్రభుత్వాలు  కఠినంగా అణిచివేసే చట్టాలను విస్తరణ విస్తరించడం, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించినవింటూ భారత్‌, యూఎస్‌ వంటి ప్రజాస్వామ్య దేశాలలో కూడా సమాచార హక్కును క్రమంగా క్షీణింపజేస్తోంది.ఇది జర్నలిజం నేరంగా, దేశ ద్రోహంగా చిత్రీకరించే స్పష్టమైన సంకేతం.
మీడియాపై జరుగుతున్న అణచివేతను, విలేకరులపై వ్యవస్థాగతంగా జరుగుతున్నఅడ్డంకులతో పత్రికా స్వేచ్ఛ నిరంతరం క్షీణిస్తుంది. సమాచార హక్కుపై దాడులు జరుగుతున్నాయి. నిరంకుశ రాజ్యాలు, నియంత రాజకీయ శక్తులు, దోపిడీకి పాల్పడే ఆర్థిక శక్తులు  పత్రికా స్వేచ్ఛ క్షీణించడానికి ప్రధాన కారణం. మరోవైపు దేశ భద్రతా చట్టాల పేరుతో పాలకులు చట్టాలను  దుర్వినియోగం చేస్తూ జర్నలిస్టులపై ప్రయోగిస్తున్నారు.ప్రశ్నపై ఆంక్షలు విధిస్తూ పత్రిక స్వేచ్చను హరిస్తున్నాయి.
అయితే  న్యాయస్థానం పౌరుల హక్కులు, పత్రికా స్వేచ్ఛను  కాపాడుతున్నప్పటికీ నిరంకుశత్వం ప్రభుత్వంలో వాటి ఆదేశాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఉపా, దేశ ద్రోహం వంటి కేసులను జర్నలిస్టులపై ప్రయోగిస్తుంది. అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టుతోంది. చట్టాలను మార్చుతూ రాజ్యాంగాన్ని బలహీనపర్చే కుట్రలు చేస్తోంది. సోషల్ మీడియా కట్టడి ముసుగుతో పత్రిక స్వేచ్చను, పౌరుల భావప్రకటన స్వేచ్చను గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోంది. అయితే సుప్రీం కోర్ట్‌ కేంద్రం కుట్రలను తిప్పికొట్టింది. మీడియా నియంత్రణపై కొత్త చట్టాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. యుద్దోన్మాదంలో ఊగిపోతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  పచ్చిమాసియాలో పత్రిక స్వేచ్చను హరిస్తున్నారు. యుద్ధ వార్తలు తప్ప యుద్ధ బాధితుల వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా మీడియాను నియంత్రిస్తూ దేశాలు, ప్రజలకు  ఫీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రేషన్‌ను అణిచివేస్తోంది.ఇజ్రాయెల్‌, పాలస్తీనా, రష్యా ఉక్రెయిన్‌ వార్‌లో ఇది పరిస్థితి.
ప్రపంచ దేశాల ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలు, వ్యవస్థలతో పాటు జర్నలిస్ట్‌లు సమిధలైతున్నారు. యుద్దంలో ఉన్న దేశాల సైనిక బలగాలతో పాటు జర్నలిస్టులు బలైతున్నారు. యుద్ద భూమిలో నిజాలతో పాటు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్ట్‌లు కూడా మృత్యువాత పడుతోన్నారు. రణక్షేత్రం నిజంతోపాటు నిజాయితీకి కూడా అగ్ర దేశాలు సమాధి కట్టుతున్నాయి. అటు చైనా,రష్యాతో పాటు కమ్యూనిస్ట్ దేశాలుగా చరిత్ర ముద్రపడిన దేశాల్లో కూడా పత్రిక స్వేచ్చ ప్రమాదంలో పడింది.ప్రశ్నించే గొంతుకలు, జర్నలిస్టులు పీకలపై నిర్బంధ కత్తులు పెట్టుతున్నాయి. చైనా, రష్యా సహా అధ్యక్ష తరహ దేశాలు స్వయంగా మీడియాపై నియంత్రణను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వాలకు, అధ్యక్షులకు వ్యతిరేకంగా రాసే మీడియాను కంట్రోల్ చేస్తున్నాయి.జర్నలిస్టులపై దేశ ద్రోహ కేసులు పెట్టి జైల్లో బంధిస్తున్నాయి.
అధ్యక్ష, నియంతల పాలనలోనే కాదు. బలమైన, పూరతమైన ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే భారత్‌, యూఎస్‌లో కూడా మీడియాపై నియంత్రణ, అణిచివేతలు కోనసాగుతోన్నాయి. యుద్దోన్మాంతో అమెరికా మీడియాను నియంత్రిస్తోంది.
ట్రంప్‌  యుద్దోన్నాదానికి, మానసిక వ్యాధికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై ట్రంప ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన దేశంగా చెప్పుకునే అమెరికా ఇవాళ నియంతృత్వాన్ని అమలు చేస్తుంది. యూఎస్‌ దురాక్రమణను ప్రశ్నిస్తున్న ఇతర దేశాధినేతలను సైనిక చర్యలతో నిర్భంధిస్తోంది. ఆర్థిక రాజకీయ సైనిక తిరుగుబాటుతో దేశాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అమెరికా చెప్పుకోవడానికి ప్రజాస్వామ్య దేశం.అక్కడ ఉన్నదంతా నియంతృత్వం, నియంత పాలన.అది ట్రంప్‌ అయిన మరే అధ్యక్షుడైనా అవే విధానాలు. అమెరికా ఫస్ట్‌ బాంబుల అమ్మకంలో  మస్ట్‌. అది అగ్ర రాజ్యం పాలసీ.అమెరికా ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మీడియా స్వేచ్చ ప్రమాదంలో పడింది. ప్రజల వాక్,భావ ప్రకటన హక్కు క్రమంగా అణచివేతకు గురైతుంది. జాతి దాడులు పెరుగుతున్నాయి. వాటిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడుఉ పెరుగుతున్నాయి.
ది న్యూయార్క్ టైమ్స్ పై పరువు నష్టం దావా వేశారు. ఇరాన్ యుద్ధం వంటి విషయాలలో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టింగ్ ద్రోహ పూరితమని వార్నింగ్‌ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ట్రంప్ ఆరోపించారు. న్యూయార్క్ టైమ్స్‌ను ప్రజల శత్రువుగా అభివర్ణించారు. మరో ప్రపంచ మీడియా దిగ్గజం బీబీసీ పై కూడా ట్రంప అక్కసు వెళ్లగక్కారు.ఏకంగా బీబీసీ పై డిఫెమేషన్‌ వేసి హెచ్చరించారు.ట్రంప్ బృందం మీడియా సంస్థలపై కఠినమైన ప్రతీకార  చర్యలతో జర్నలిజానికి మరణశాసనం రాస్తుంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మీడియాను టార్గెట్‌ చేశారు. రాయిటర్స్ వంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలతో పాటు  అంతర్జాతీయ మీడియాను విమర్శిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన పరిపాలనపై ప్రతికూల వార్తలు ప్రసారం చేసే మీడియాపై ఒత్తిడి పెంచారు.
మరోవైపు భారత ప్రభుత్వం దేశభక్తి ముసుగులో మతోన్మాదం ఎజెండాను అమలు చేస్తు జర్నలిస్టులను వేధిస్తుంది. గౌరి లంకేశ్‌ మొదలు అనేక మంది జర్నలిస్టులను బీజేపీ సర్కార్‌ అండతో మతోన్మాదులు హత్య చేశారు. అంతేకాదు అనేక మీడియా సంస్ధలను మతోన్మాదులతో నింపేశారు. ప్రైమ్‌ లో డిబెట్స్‌ వైవిధ్యం కొరవడింది.
పక్షపాత కథనాలు,ఏకపక్ష నివేదికల పేరుతో హిందుత్వ జాతీయవాద భావజాలాన్ని ఒక ఆధిపత్య శక్తిగా మారి, వోటర్‌ పోలరైజేషన్‌ చేస్తూ రాజకీయలను, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలకు, మైనారిటీ గొంతుకలు వినిపించే అవకాశాలను పరిమితం చేస్తు ప్రజలల్లో ఒక నరేటీవ్ క్రీయేటివ్ చేస్తూ ఒక ఎజెండాను సెట్‌ చేస్తున్నాయి.    జాతీయ మీడియాలో 99 శాతం సంస్థలు తమ ప్రసారంతో  గణనీయమైన భాగాన్ని మతపరమైన వార్తలకు కేటాయిస్తోంది. కొన్నిసార్లు బహిరంగంగా ముస్లింల పట్ల ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయి.ముస్లింలు దేశ ద్రోహులు, హిందు వ్యతిరేకులంటూ ప్రచారం చేస్తూ మీడియా ట్రయల్స్‌ చేస్తూ ప్రజల్లో ఇన్‌స్టెంట్‌ అభిప్రాయం కలిగేలా ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ..
ట్రంప్‌ తరహాలోనే భారత్‌లో బీజేపీ ప్రభుత్వం కూడా జర్నలిస్ట్‌లపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది..జాతీయ మీడియాను మొత్తం తన మిత్రుల గుప్పిట్లో పెట్టుకుంది.అంబానీ, ఆదాని వంటి అంతర్జాతీయ బడా కార్పొరేట్ నేరగాల్లో చేతుల్లో 99 శాతం మీడియాను పెట్టుకుని తమ స్వలాభాల కోసం ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం సృష్టిస్తూ వోటర్‌ మనసు మార్చుతూ కులం, మతం, దేశ భక్తి భావోద్వేగంతో కూడిన ఘటనల ప్రాపగండా చేస్తూ బీజేపీకి అనూకూల పరిస్థితిని సృష్టిస్తున్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ఎన్డీటీవీ వంటి సంస్థలను అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ సంస్థపై, అందులో జర్నలిస్ట్‌లపై ఒత్తిడి తీసుకువచ్చి, ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టి అదానీ వంటి వారికి ధారాదత్తం చేశారు.మొత్తం ఇండియన్‌ మీడియాను గోడీ మీడియాగా మార్చారు.
విశ్వగురువు భజన గోదీ  మీడియా భుజాలకెత్తుకుంది. ఈ దరిద్రం ఇప్పుడు తెలుగు మీడియాలో కూడా కనిపిస్తుంది. ప్రజా సమస్యల ఎజెండాను పక్కనబెట్టి మోదీ  భజన ఎజెండాను భుజాలపై మోస్తున్నాయి. అంతేకాదు బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య కట్టింది.ఇండియన్‌ చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రపంచ మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది.బీబీసీ వంటి సంస్థలను వేధించింది.బీబీసీ ఇండియాలో మూసేస కుట్రలు చేసింది. ప్రధాన స్రవంతి మీడియాలో బహుళత్వానికి ఎలా ముగింపు పలికిందో, గోదీ  మీడియా పెరుగుదలను గమనిస్తే, దేశంలో ఒత్తిడి, పలుకుబడి ద్వారా బీజేపీ బహుళత్వ పత్రికారంగ భారత నమూనాను ఎలా ప్రశ్నార్థకం చేయబడుతోందో ఎన్డీటీవి ఉదాంతం కళ్ల ముందే ఉంది.
దేశంలో మీడియాను మోదీ  సర్కార్‌ కఠినంగా నియంత్రిస్తుంది. ప్రజలకు భారత రాజ్యాంగా ఆర్టికల్ 19 ప్రకారం కల్పించిన వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హరిస్తోంది. ఫ్రీ డమ్‌ ఆఫ్ ఎక్స్‌ప్రేషన్‌ లేకుండా చేస్తోంది. అసమ్మతి గొంతులపై, ప్రశ్నిస్తున్న మీడియాను  కంట్రోల్‌ చేసేందుకు కొత్త చట్టాలను తీసుకువస్తుంది. కొత్త ఐటీ చట్టాలు, కొత్త మీడియా చట్టాలను తీసుకువస్తు ప్రజల ప్రశ్నించే హక్కును అణిచివేస్తోంది. మీడియా స్వేచ్చను హరిస్తూ నిర్భంధిస్తోంది. మీడియాను నియంత్రిస్తూ అనాధికారిక సెన్సార్‌ షిప్‌ అమలు చేస్తోంది.
ప్రధానమంత్రి పత్రికా సమావేశాలు నిర్వహించరు, తనను అనుకూలంగా చూపించే జర్నలిస్టులు, యూట్యూబర్‌లకు మాత్రమే సెలెక్టివ్‌గా ఇంటర్వ్యూలు ఇస్తారు, ఏం  చెప్పాలనుకున్నారో అదే చెప్పుతారు.మత రాజకీయాలు, కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రులను విమర్శలు తప్ప తాను ఏం చేస్తున్నారో చెప్పరు. మరోవైపు తన ప్రభుత్వానికి వ్యతిరకంగా రాసే మీడియాపై, తనపై విధేయత చూపని వారిని తీవ్రంగా విమర్శిస్తారు.
అదే టైంలో బీజేపీ మద్దతు ఉన్న ట్రోల్స్ ద్వారా భారతీయ జర్నలిస్టులు వేధింపులకు గురి చేస్తారు. ప్రపంచంలోనే బీజేపీ బలమైన పార్టీ మాత్రమే కాదు, బలమైన సోషల్‌ మీడియా ఉన్న పార్టీ కూడా..ఈ బలంతోనే ప్రత్యార్థులను, జర్నలిస్టులను టార్గెట్‌ చేస్తారు.అవసరమైన మూక దాడులు చేస్తారు.అయిన వెనక్కి తగ్గని జర్నలిస్టులను గౌరి లంకేశ్‌లాగా హత్య చేస్తారు.
ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై నిత్యం కాషాయ మూక ఆన్‌లైన్ లో  వేధింపులకు గురిచేస్తూ బెదిరింపులు, శారీరక దాడులతో పాటు, క్రిమినల్ విచారణలు పెట్టి అక్రమంగా అరెస్టులకు  చేస్తారు. పోలీసులు,రాజకీయ కార్యకర్తలు, అలాగే  క్రిమినల్స్‌, అవినీతిపరులతో జర్నలిస్ట్‌లు హింసకు బాధితులు అవుతున్నారు. జర్నలిస్టులపై, విమర్శకులను ద్రోహులు, దేశ వ్యతిరేకులుగా ముద్రవేసి వారిపై ప్రజా ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో భయంకరమైన ద్వేషపూరిత ప్రచారాలు చేస్తున్నారు. హత్యలకు పిలుపునిస్తున్నారు. మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా  హింసాత్మకంగా దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టుల పరిస్థితి  ఆందోళనకరంగా మారింది. తరచుగా పోలీసులు, భద్రతా దళాలచే వేధింపులకు గురవుతున్నారు, కేసుల పేరుతో జర్నలిస్ట్‌లను ఏళ్ల తరబడి తాత్కాలిక నిర్బంధంలో ఉంచుతున్నారు.
రాష్ట్రంలో ..
.తెలంగాణలో కూడా మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై, రాస్తున్న జర్నలిస్టులపై సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా జర్నలిస్టులు, మేన్‌ స్ట్రీమ్ జర్నలిస్టులంటూ ప్రభుత్వం విభజన తీసుకువచ్చింది. మేన్ స్ట్రీమ్ మీడియా ప్రభుత్వానికి బానిసగా మారితే, సోషల్‌ మీడియా సర్కార్ వైఫల్యాలను బహిర్గతం చేస్తుంది . అయితే సోషల్ మీడియాను ప్రభుత్వం గుర్తించకుండా,అక్రిడిటేషన్‌ కార్డుల నుంచి అందులో పని చేసే జర్నలిస్టులపై సీఎం ప్రతిసారీ మాటలు తూలనాడుతోండు. అసలు వాళ్లు జర్నలిస్టులేకాదన్నట్లు మాట్లాడుతున్నారు.
అంతేకాదు, కాంగ్రెస్‌ ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛను హరిస్తూ, ప్రజల వాక్ స్వాతంత్య్రం , భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. జర్నలిస్టులపై అక్రమ, పొలిటికల్ ప్రేరేపిత కేసులు పెట్టుతూ వేధిస్తోంది. ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోంది. సత్యాన్ని సమాధి చేస్తూ అసత్యాన్ని ప్రచారం చేస్తోంది. జర్నలిస్టుల కుతికెల పై కేసుల ఉపా, దేశ ద్రోహం కేసుల కత్తిని వేలాదీసింది. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ అయిన ప్రజాస్వామ్యం, పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగం అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ,రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు.ఏడో గ్యారంటీ కూడా అమలు చేయడం లేదు.వెరసి సోషల్ మీడియా కంట్రోల్ చట్టాలు తీసుకువచ్చే కుట్రలు చేస్తుంది.అంతేకాదు ఏకంగా ఒక సోషల్ మీడియాపై ఉగ్రవాదుల నిరోధక చట్టాన్ని ప్రయోగించింది.సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ మాతృ సంస్థకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం లేఖ రాసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తూ ప్రశ్నించే గోంతులను అణచివేస్తూ ప్రజల భావప్రకటన హక్కును ఎలా  హరిస్తుందో ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి.
అయితే మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ‘ది కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌(సీపీజే), అనేక అంతర్జాతీయ మీడియా సంఘాలు ముక్త కంఠం తో  ఖండించాయి. మీడియాను అణచివేసే ధోరణి ప్రభుత్వం మానుకోవాలి హెచ్చరించాయి. ఏదీ ఏమైనా ప్రపంచ వ్యాప్తంగానే కాదు, ఇండియాలో తెలంగాణలో కూడా మీడియాపై అణిచివేతలు సాగుతున్నాయి. జర్నలిస్టులపై, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్భంధించడం ఒక కుట్రల పూరితంగా జరుగుతోంది. రోజురోజు మీడియా స్వేచ్చ దిగజారిపోతోంది. అంతిమంగా ప్రశ్నించే హక్కును ప్రజలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది.
-తోటకూర రమేష్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *