ఆర్అండ్‌బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి

– అదే రోజున ఎస్సెస్సీ జేఈ పరీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ ఏఈఈ పరీక్ష, కేంద్ర ప్రభుత్వ ఎస్సెస్సీ జేఈ పరీక్ష నవంబర్ 6వ తేదీనే నిర్వహించనున్నారు. దీంతో 50 వేల మందికి పైగా రాష్ట్రానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎస్సెస్సీ పరీక్ష తేదీని వెబ్‌సైట్‌లో ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో, ఏది వదులుకోవాలో తేల్చుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని బీఆరఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు పలుమార్లు మంత్రులకు, అధికారులకు మొరపెట్టుకున్నా, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. ప్రభుత్వ భేషజాల వల్ల విద్యార్థులు విలువైన అవకాశాన్ని కోల్పోయి వారి భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఆర్ అండ్ బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులందరూ రెండు పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించి వారి భవిష్యత్తును కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *