కాళేశ్వరంతో ఎలాంటి సమస్యలు లేవు

– వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి
– మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌

‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22: ‌తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో బాగమైన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర జల విద్యుత్‌ ‌పరిశోధన సంస్థ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల ఎక్సలెంట్‌, ‌గుడ్‌ అని రిపోర్ట్ ఇచ్చిందని రిపోర్ట్ ‌తో నైనా రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కళ్లు తెరవాలని హితవు పలికారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం లోకి తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికే ఎల్‌నినోతో రాబోయే పంట కాలంలో సాగు నీటి కి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నాయని అన్నారు. రెండు నెలల క్రితమే బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటిఆర్‌ ‌కన్నెపల్లి పంపు హౌజ్‌ ‌ను సందర్శించి, సాగు నీరు, తాగు నీటికి వచ్చే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వానికి సూచించారని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం లోకి తెస్తే కేసీఆర్‌ ‌కు పేరొస్తుందని ప్రభుత్వ భేషజాలకు పోతుందని విమర్శించారు.కన్నెపల్లి నుంచి వృథాగా దిగువన నీరు పోతున్నదని, చంద్రబాబు కోసం గురు దక్షణగా నీటిని రేవంత్‌ ‌రెడ్డి అందజేస్తున్నారని విమర్శించారు. కన్నెపల్లి పంపు హౌజ్‌ ‌వద్ద రూ.100 కోట్ల తో కాఫర్‌ ‌డ్యాం కట్టి వినియోగంలోకి తేవాలని సూచించారు. కేసీఆర్‌ ‌దూర దృష్టితో కాళేశ్వరం కట్టారని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *