సచివాలయం ముందు పెద్ద గుంత

– లంకె బిందెల కోసం తవ్వారా అంటూ కెటిఆర్‌ ‌సెటైర్లు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్22:‌హైదరాబాద్‌లోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా తెలంగాణ సచివాలయం ముందే పెద్ద గుంత తవ్వి అలాగే వదిలేయడంపై ఓ నెటిజన్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆ భారీ గుంతను చూపిస్తూ ఎక్స్‌లో చేసిన పోస్టుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పోస్టుపై స్పందించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌రేవంత్‌ ‌సర్కార్‌పై సెటైర్లు వేశారు. సెక్రటేరియట్‌ ‌ముందే ఇంత పెద్ద గుంత ఉంది. ఎవరైనా సెక్రటేరియట్‌ ‌చూసుకుంటూ వస్తే ఈ గుంతలో పడి ఛస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంతమంది పోలీసులు వెళ్తుంటారు. ఇంతమంది జనాలు వెళ్తుంటారు.. అలాంటి చోట ఏంటి గుంతనా అని ప్రశ్నించారు. సీఎం గారూ హుస్సేన్‌ ‌సాగర్‌ను ఇక్కడ కూడా పెట్టాలని అనుకుంటున్నారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రోజూ ఎంతోమంది తిరుగుతుంటారు.. దీన్ని క్లోజ్‌ ‌చేద్దామన్న రెస్పాన్సిబిలిటీ ఉండదా? జీహెచ్‌ఎం‌సీ వాళ్లు రోడ్లపై తిరుగుతూ చూడరా? అస్తమానం ఎవరో ఒకరు కంప్లయింట్‌ ఇస్తేనే తెలుస్తుందా? అని నిలదీశారు. వీలైనంత తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా.. లోపల ఇలాంటివి చాలా ఉన్నాయ్‌.. ‌లోపల దాచిపెట్టాం అని జీహెచ్‌ఎం‌సీ అన్నట్లుగా క్యాప్షన్‌ ‌పెట్టాడు.  పోస్టు వైరల్‌గా మారడంతో హైదరాబాద్‌ ‌రోడ్ల పరిస్థితి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ ‌కూడా స్పందించారు. లంకెబిందెల కోసం తవ్వుతున్నారేమో అని వ్యంగ్యంగా కామెంట్‌ ‌పెట్టారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని కూడా జత చేశారు. దీంతో కేటీఆర్‌ ‌కామెంట్‌ ‌కూడా వైరల్‌గా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *