– ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు ఎందుకివ్వడంలేదు?
– రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ ఎస్ వర్తించడంలేదు
– రూ.15కోట్ల వరకు పింఛను బకాయిలు
– ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు బకాయి
– సీపీఎస్ ఉద్యోగుల సభకు ఎందుకు అనుమతివ్వరు?
– ఉద్యోగుల నిరసనకు బీఆర్ ఎస్ అండ
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22: అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభు త్వం మోసం చేసిందని, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫల మైందని కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వి.దేవీప్రసాద్ ఆరోపించారు. శని వారం ఆయన తెలంగాణ భవన్ లో ప్రెస్మిట్లో మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డు లు ఇస్తున్నామని చెప్పే ఈ ప్రభుత్వం, ఉద్యోగులకు ఎందుకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఖాజా మొహియుద్దీన్ అనే రిటైర్డ్ టీచర్ ఈహెచ్ ఎస్ వర్తించక, రూ.8 లక్షలుప్రైవేట్ ఆస్పత్రిలో బిల్లు కట్టాడు.ఇలా వేల మంది ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కానీ ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అసమర్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. రూ.15 వేల కోట్ల వరకు ఉద్యోగుల పెన్షన్ దారులకు బకాయిలు పెండింగ్లో వున్నాయి. ప్రతి నెల రూ.2000 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు రికవరీ కోసం కమిటేషన్ వేశారే తప్ప, పెన్షన్ దారులకు ఒక్కరోజు ముందు కమ్యుటేషన్ చెల్లించినందుకు ఇంట్రెస్ట్ వసూలు వేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనలోనే 6 డీఏ లు పెండింగ్ లో ఉన్నా యి. ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలి. సీపీఎస్ ఉద్యోగులు సభ పెట్టుకుంటామంటే పోలీసు లు పర్మిషన్ ఇవ్వడం లేదు. వీరేమైనా మైనా దేశ ద్రోహులా, ఎందుకు సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు హరీష్ రావు వెళ్తుంటే కాలు బయట పెట్టకుండానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పెట్టే సభలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు, కోర్ట్ ను ఆశ్రయించి అనుమతి పొందడం సహజ ప్రక్రియగా మారింది. కేసీఆర్ ఉన్నపుడు ఉద్యోగుల సభకు అనేక పర్మిషన్ లు ఇచ్చారు.సరూర్ నగర్ లో సభ ఉద్యోగులు ఏర్పాటు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏం పని కావాలన్నా హై కోర్టు తలుపు తట్టాలి. ఉద్యోగుల నిరసన సభకు బిఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించడమే కాదు వారితో భుజం భుజం కలిపి పోరాడతామన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో లక్షలాదిమంది ఉద్యోగులు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారన్నారు. ఉద్యోగులను వేధించినా ఇబ్బంది పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రం కోసం ముందుండి కోట్లాడిందే ఉద్యోగులు.. ఉద్యోగులకు ప్రత్యేక రాష్ట్రం మీద ఉన్న ప్రేమను మన్మోహన్ సింగ్ ఆనాడు మెచ్చుకున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి ఉద్యోగుల నుంచి జీతం కట్ చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో మాత్రం పెట్టడం లేదు. మూడు నెలల నుంచి ఉద్యోగోగస్తుల నుంచి ముక్కు పిండి ఈహెచ్ఎస్ వసూలు చేస్తున్నపుడు హాస్పిటల్ లో ఈహెచ్ ఎస్ఎందుకు పనిచెయ్యడం లేదని ప్రశ్నించారు. నెలకు రూ.2 వేల కోట్ల రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇస్తున్నామని ప్రభుత్వం అబద్ధం చెబుతున్నదన్నారు. పీఆర్సీ, డీఏ లు ఈ ప్రభుత్వంలోనే అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయి. 4.90 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల వెయ్యి కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి, ఎవరు తిన్నారో బయటపడాలి. ఒక మంత్రి ఈ పని చేసినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో రూ.3 లక్షలకు ఒక లష్కర్ పోస్ట్ అమ్ముకున్నారని ఆరోపించారు. నీళ్లు దోచుకొని పోతున్నారు. ఉద్యోగాలు దోచుకొని పోతున్నారు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు రాష్ట్రానికి దిక్కయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజిల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేవనీ సీ డబ్ల్యూ పీ ఆర్ ఎస్ తన నివేదిక లో స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రభుత్వం కాళేశ్వరంపై ఇంత కాలం చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని బట్టబయలు చేసిందన్నారు. ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు.. అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతున్నా సీపీఎస్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేసే వరకు ఉద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుంద న్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉద్యోగాలను ఈ ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. ప్రెస్ మీట్ లో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, టీ ఎన్ జీ ఓ ల సంఘం మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ , రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత భుజంగ రావు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





