- బాధితులకు అండగా ఉంటాం
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 28 : నేరెళ్ల ఘటన సమాజం సిగ్గుతో తలదించు కోవాల్సినదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నేరెళ్ల ఘటనలో మరణించిన గంధం గోపాల్ కుటుంబ సభ్యు లను మంగళవారం పరామర్శించిన అనంతరం ఆమె మీడి యాతో మాట్లాడారు. నేరెళ్లలో జరిగిన ఘటన రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న కుటుంబంలో తాను కూడా సభ్యురాలినేనని, అందుకు సిగ్గుతో తలదించుకుంటూ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. కొంతమంది ధన దాహం కోసం అమాయకుల ప్రాణాలు బలైపోయాయని ఆమె ఆరోపించారు. ఇసుక లారీల కారణంగా ఒక చిన్నారి మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చేపట్టగా వారిపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారన్నారు. ఐదు రోజులపాటు పలువురు బాధితులను తీవ్రంగా హింసించారని, వారి పరిస్థితి చూసి జైలుకు కూడా తీసుకోవడం కష్టమైందని అన్నారు.
ఈ ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ను ప్రశ్నించారు. జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ నివేదిక ఇప్పటికీ బయట కు రాకపోవడంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. బాధితులకు తాము అండగా ఉంటామని, అవసరమైతే బాధితులతో కలిసి దిల్లీకి వెళ్లి ఎస్సీ కమిషన్ నివేదిక విడుదల కోసం పోరాటం చేస్తామని చెప్పారు గంధం గోపాల్ కుటుం బం తొమ్మిదేళ్లుతతగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపా యి సాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మజీద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, రాష్ట్ర నాయకులు రూప్ సింగ్, పవన్, రంజిత్, ఆ నంద్, ప్రవీణ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి నాగరాజు, మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి చైతన్య, మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్, జావిద్, మార్వాడి దేవరాజు, బైరి రాజేష్, రమావత్ మోహన్, రేణుక, మంగ, లాస్య, వీర్నపల్లి ఇన్చార్జి బండి శ్రీహరి, వేములవాడ ఇన్చార్జి తోట కనకయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





