- ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహణ..
- బ్రోచర్ ఆవిష్కరించిన ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : వరంగల్ కిట్స్‌లో ప్రాంగణంలో ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్, టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), 10 ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సుమశోధిని-26’ ఈనెల 30, 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కిట్స్ క్యాంపస్‌లో మంగళవారం కోశాధికారి పి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ, లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ సమ్ శోధిని’26 థీమ్ “ఊహ నుంచి ఆవిష్కరణ” అని పేర్కొన్నారు. వివిధ ఇంజనీరింగ్ డొమైన్ల రంగంలో విద్యార్థి సమాజం అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పంచుకోవడానికి. నేర్చుకోవడానికి ఇది ఇంటర్ డిసిప్లినరీ సాంకేతిక వేదిక అని తెలిపారు. ఇది విద్యార్థి సమాజంలో నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్,కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో కూడిన 10 ఇంజనీరింగ్ విభాగాలు, యం బి ఎ వారు వివిధ సాంకేతకపరమైన వర్క్‌షాప్ లు నిర్వహిస్తారు.
కోశాధికారి పి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సమ్ శోధిని ఫెస్ట్ సందర్భంగా పేపర్ ప్రెజెంటేషన్లు అన్ని శాఖలకు సాధారణ కార్యకలాపం గాను, కాష్ ప్రైజ్ రూ 1,00,000 ల వరకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రాజెక్ట్ ఎక్స్పో, రియల్ స్తిక్, ట్రెజర్ హంట్, 50 కి పైచిలుకు సాంకేతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఫెస్ట్‌లో సాంకేతికేతర ఈవెంట్లతో పాటు 50 పైగా టెక్నికల్ ఈవెంట్లు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్:www.sumshodhini.kitsw లేదా kitsw.ac.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.. విద్యార్థి సాంకేతిక పరిశోధనల పత్రాలను sumshodhini@kitsw.ac.in. ఈ-మెయిల్ ద్వారా 24 అక్టోబర్, 2026, లేదా అంతకు ముందు పంపించాలని అన్నారు. పరిశోధనా పత్రం ఐఈఈఈఈ పేపర్ ఫార్మాట్ ప్రకారం ఉండాలని సూచించారు.
ముఖ్యమైన తేదీలు:
కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజులలో 50కి పైగా సాంకేతిక మరియు సాంకేతికేతర ఈవెంట్లు ఉంటాయని తెలిపారు.
-
రిజిస్ట్రేషన్ వెబ్సైట్: www.sumshodhini.kitsw.ac.in లేదా kitsw.ac.in
-
పరిశోధన పత్రాల సమర్పణ: IEEE ఫార్మాట్లో రూపొందించిన పేపర్లను sumshodhini@kitsw.ac.in ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
-
చివరి తేదీ: అక్టోబర్ 24, 2026.
-
అంగీకార సమాచారం: అక్టోబర్ 25, 2026 లోపు తెలియజేయబడుతుంది.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, పరిపాలన అధికారి ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ & ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్.కె. శ్రీధర్, ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డా. టి. మధుకర్ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్, డాక్టర్ ఎస్. సునీల్ ప్రతాప్ రెడ్డి & బి. శశికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు పిఆర్ఓ డా.డి. ప్రభాకరా చారి, డీన్‌లందరూ, వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్ ప్రెసిడెంట్ కె. సాయి సిద్ధార్థ రెడ్డి, టెక్నికల్ క్లబ్ విద్యార్థి అధ్యక్షుడు నిఖిల్ మాదరవేన హాజరయ్యారు.





ఆ వ్యాఖ్యలపై మీ వైఖరి ఏమిటి?