– 438 అవగాహనా కార్యక్రమాలు
– పాల్గొన్న 82 వేలమందికి పైగా పౌరులు
– డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
– టీజీసీఎస్‌బీ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:పౌరుల్లో సైబర్ అవగాహనను పెంచడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా దివస్’ ఘనంగా నిర్వహించారు.. ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా TGCSB తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రత్యేక ప్రచార సామగ్రిని అన్ని పోలీసు స్టేషన్లకు అందించింది. లా అండ్ ఆర్డర్ పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు ఈ డ్రైవ్‌లో చురుగ్గా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 438 కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుల్లో దాదాపు 82,573 మంది పౌరులు పాల్గొన్నారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ మండపాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు ప్రత్యేక సైబర్ భద్రతా ప్రచార సామగ్రిని కూడా అందుబాటులో ఉంచారు.
బాధితులు వెంటనే స్పందించాలి
ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో విక్రేతలను, వెబ్‌సైట్లను సరిచూసుకోవాలని, అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్ (కీలక సమయం)లో వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీజీసీఎస్‌బీ పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



