అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని ‘ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడిరచింది. అయితే వృద్ధులకు తగినట్టు నగరాలు, గ్రామాల్లో వాతావరణం ఉండడం లేదు. నీరు, గాలి అంతా కలుషితమై చాలా సమస్య లను తెచ్చిపెడుతోంది. స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని ప్రజలు 89 శాతం కాలుష్యాన్ని భరిస్తున్నారు. కాలుష్య పీడిత ప్రాంతాల్లో వృద్ధుల బతుకు నరకయాతన అవుతోంది. నగరాలు, గ్రావిరీణ ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో ఏటా 4.2 మిలియన్ల అకాల మరణాలు సంభవిస్తు న్నాయని 2019లో చేపట్టిన అధ్యయనంలో వెల్లడ్కెంది. హృదయ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ లకు కారణమయ్యే కాలుష్య సూక్ష్మకణాల బారిన పడడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాల్లో నిర్దారణ అయింది. 60 ఏళ్లు దాటిన వారిలో కాలుష్యం వల్ల వారి ద్కెనందిన జీవన కార్యకలాపాలు సాగడం లేదని ఒక కొత్త అధ్యయనం వెల్లడిరచింది.
అమెరికాలో సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు సగటున 15,411 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు బయటపడ్డాయి. అరవై ఏళ్లు పైబడిన వారిలో కనీసం 48 శాతం మంది కాలుష్యానికి గురి కావడం వల్ల రోజువారీ కార్యకలాపాలను నిర్వహించ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తేలింది. వాయు కాలుష్య ప్రభావాన్ని పరిశీలిస్తే పర్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం2.5, మరియు పిఎం 102.5) తోపాటు న్కెట్రొజన్ డయాక్సైడ్ (ఎన్‌ఒ2) అధిక సాంద్రతలు వృద్ధుల ద్కెనందిన కార్యకలాపాలకు తీవ్ర రిస్కు కలిగించేవిగా ప్రభావం చూపిస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల వొచ్చే ఇబ్బందులను వృద్ధుల్లో చాలా మంది అంతగా పట్టించుకోవడం లేదు. పిఎం2.5, పిఎం 10, న్కెట్రొజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్య రేణువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో మంటపుట్టి ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తుంది. శరీర కండరాలు నీరసపడి పోతాయి. శ్వాసకోశ వ్యవస్థ మాత్రమే కాదు, శరీర వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారు అవయవ పనితీరులో, రోగ నిరోధక స్థితిస్థాపకతలో సహజమైన క్షీణతను అనుభవిస్తున్నారు. ఈ వయసు వారు గుండె జబ్బు లు, క్రానిక్ అబ్స్టక్ట్రివ్ పల్మనరీ డిసీజ్, మధుమేహం వంటి వ్యాధుల పీడితుల్కె గడుపుతున్నారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహించిన లాంగిట్యూడినల్ ఏజింగ్స్టడీ ఆఫ్ ఇండియా 2021 నివేదిక భారత దేశం లోని వృద్దాప్య జనాభా ఎదుర్కొంటున్న పరిస్థితులు బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం 75 శాతం మంది వృద్ధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.. ఇంకా 24 శాతం మంది డ్కెలీ లివింగ్ కార్యకలాపాల్లో (ఎడిఎల్ ) కనీసం ఒక పరిమితిని కలిగి ఉన్నారు. 48 శాతం మందికి తమ ద్కెనందిన వ్యవహారాల్లో ఎవరో ఒకరి సహాయం కావలసి వస్తోంది. కుటుంబాల ఆసరా లేక ప్రతి ముగ్గురిలో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారు. 32 శాతం మంది అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్నారు. సామాజిక రక్షణకు సంబంధించి 18 శాతం మంది వృద్ధులకు మాత్రమే ఆరోగ్య బీమా ఉంటోంది, 28 శాతం మంది వృద్ధులకు రాయితీల గురించి తెలిసినా, 70 శాతం మంది వృద్ధులు రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడుతున్నారు. 78 శాతం మంది ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వృద్ధుల సంరక్షణ సేవలు అందించే ఎల్డర్ కేర్ స్టార్టప్ ( అంకుర పరిశ్రమ)లు తెరవిరీదికి వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ఎదురైన తరువాత వృద్ధుల సంరక్షణ ఆయా కుటుంబాలకు ఒక సమస్యగా తయారైంది. అందువల్ల వృద్ధుల సంరక్షణ కేంద్రాలను ఆశ్రయించడం తప్పనిసరి అవుతోంది. ఈ సంరక్షణ కేంద్రాలన్నీ కేవలం సేవా సంస్థల్లా కాకుండా ఎంతో కొంత నగదు చెల్లింపుల ఆధారంగా పనిచేస్తుంటాయి. అయితే పేదలైన వృద్ధులకు ఈ ఎల్డర్ కేర్ స్టార్టప్‌ల నుంచి సాయం పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి ఒక విధంగా వాణిజ్యపరమైన సంస్థలు అయినందున ప్రతినెలా వారు ఛార్జీ చేసిన మేరకు డబ్బు వెచ్చించ వలసి వస్తుంది. ఆర్థికంగా స్థితిమంతుల్కెన కుటుంబాలలో వృద్ధులను సంరక్షిం చడానికి ప్రయివేట్ రంగంలో అనేక స్టార్టప్(అంకుర పరిశ్రమ)లు ఉన్నాయి.
పేషెంట్ కేర్, ఫెసిలిటీ మేనేజ్మెంట్వరకు సకల సౌకర్యాలు సమర్ధవంతంగా ఇవి అందజేయ గలుగుతాయి. వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండి వృద్ధుల ఆరోగ్యభద్రతను నిర్వహిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో ఒంటరి వారైన వృద్ధులకు ఈ స్టార్టప్ కేర్ సెంటర్ల ద్వారా సంరక్షణ అందించాలంటే నెలకు రూ.90,000 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే వృద్ధుల్కెన తల్లిదండ్రులకు సంరక్షణ కోసం నెలకు రూ.2 లక్షల వరకు భరించవలసి వస్తుంది. రానున్న 30 ఏళ్ల లో ఈ ఖర్చు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. మనదేశంలో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు సేవా దృక్పథంతో నామమాత్రం గా నెలకు రూ.15,000 నుంచి 25,000 వరకు ఛార్జి చేస్తున్నాయి. అయినా ఆమేరకు కూడా చెల్లించలేని నిరుపేద వృద్ధులు దేశంలో చాలా మంది ఉన్నారు. సగటు భారతీయులకు ఈ సేవల ఖర్చు తగ్గించాలనుకోవడం ఒక సవాలే. వృద్ధుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురాడానికి ఆర్థిక అడ్డంకులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
-కందుల శ్రీనివాస్
(సీనియర్ జర్నలిస్ట్ )





