దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలి

– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ శుక్లా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఈ సందరá్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్ జాతీయ పతకాన్ని మంగళవారం ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అనే సూక్తిని ప్రస్తావిస్తూ జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని ప్రస్తావించారు. రాజ్యాంగ విలువలు, సర్వే భవంతు సుఖినః స్ఫూర్తితో సుసంపన్న తెలంగాణ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సమపాళ్లలో సాగాలన్నారు. దేశ ప్రగతిలో మరింత కీలక పాత్ర పోషించాలన్నారు. ఆధునిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా స్మరించుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. తెలంగాణ శతాబ్దాల నాటి సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వ్యవసాయ వారసత్వం రాష్ట్ర అసలైన జీవనాడిగా నిలిచాయన్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల నుంచి నేటి ఆధునిక సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతాంగం చేసిన కృషి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు. వ్యవసాయ రంగంతోపాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ తదితర రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. వేడుకల్లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *