– కాంగ్రెస్ క్యాడర్ బూత్ విడిచి వెళ్లవద్దు
– ఎంపీ చామల పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: ’సర్’పై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సర్ క్రియను కాంగ్రెస్ క్యాడర్ అధిగమించాలని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు అంతా ఈపక్రియను పరిశీలించాలన్నారు. రెండు చోట్ల వోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నెల రోజుల పాటు బీఎల్‌వోలు బూత్‌ను విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ప్రతి పది బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సూపర్‌వైజర్‌ను పెడుతున్నామన్నారు. బీఎల్‌వోలతో నాయకులు నిరంతరం టచ్‌లో ఉండి ‘సర్ ‘ జరిగే విధానాన్ని పరిశీలించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఎస్‌ఐఆర్ పక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్‌ఏలను నియమించామని తెలిపారు. ఎస్.ఐ.ఆర్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. బిహార్‌లో 76 లక్షల వోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల వోట్లను తొలగించారని, ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుగానే అలర్ట్ కావడంతో కాపాడుకోగలిగామని ఎంపీ వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరగబోతోందన్నారు. నెల రోజుల పాటు జరిగే సర్ పక్రియలో బీఎల్‌వోలు మూడు సార్లు ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారన్నారు. తెలంగాణలో ఇప్పటికే కోటి 2 లక్షల వోట్లను అన్‌మ్యాప్ చేశారని.. అంటే దాదాపు 33 శాతం వోట్లు అన్‌మ్యాప్ అయ్యాయని తెలిపారు. బీఎల్‌వోలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వోట్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందన్నారు. 2002 వోటర్ లిస్ట్, 2025 వోటర్ లిస్ట్, అన్‌మ్యాప్ వోటర్ లిస్ట్‌ను దగ్గర పెట్టుకుని పరిశీలించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.