– 14 నియోజకవర్గాల్లో ఈ-లాటరీ ద్వారా 1741 ఇండ్ల కేటాయింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో చేపట్టి నిర్మిస్తున్న ఇండ్లలో పలు కారణాలవల్ల అందుబాటులోకి వచ్చిన 1741 ఇండ్లను ఈ-లాటరీ ప్రక్రియ ద్వారా బుధవారం కేటాయించారు. అవుటర్ రింగ్ రోడ్ లోపలివైపు ఉన్న క్యూర్ ప్రాంతంలోని అల్పదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో ఇండ్లు కావాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోనూ 480 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇండ్లను కేటాయించిన తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలనల్లో అనర్హులుగా తేలడం, ఎంపికైన వారిలో కొందరు తమ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా కేటాయింపును రద్దు చేసుకోవడం మొదలైన కారణాల వల్ల 14 నియోజకవర్గాల పరిథిలో 1741 ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈవిధంగా అందుబాటులోకి వచ్చిన ఇండ్లను బుధవారం నిర్వహించిన మాప్-అప్ ఈ-లాటరీ ద్వారా ఎంపికైన వారికి కేటాయించారు. ఈ లాటరీ ప్రక్రియలో హౌసింగ్ బోర్డు వైస్ చైౖర్మన్ వి.పి.గౌతం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ లాటరీ ప్రక్రియలో అందుబాటులోకి వచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 80, మల్కాజిగిరిలో 150, కూకట్‌పల్లిలో 59, సనత్ నగర్లో 88, కంటోన్మెంట్లో 66, బహదూర్‌పురలో 91, కార్వాన్లో 73, మేడ్చల్‌లో 143, నాంపల్లిలో 106, మలక్‌పేటలో 171, మహేశ్వరంలో 201, రాజేంద్రనగర్ 133, ఖైరతాబాద్‌లో 327, అంబర్‌పేటలో 53 ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేశారు. ఏర్పడిన ఖాళీలకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్ లిస్టు కోసం ఈ-లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ-లాటరీలో ఎంపికైన వారందరికీ ఎసఎంఎస్ ద్వారా సమాచారం అందించారు. వీరందరి వివరాలను నిర్ధారించుకునేందుకు అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





