– మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు
– నిందితుడు రమావత్ మధు ట్రాన్స్ఫర్
- బ్యాంకర్లను వివరాలు కోరిన పోలీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్30: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివచౌహాన్ అకౌంట్‌కు నిందితుడు రమావత్ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా మధు అకౌంట్‌ను పరిశీలించగా శివ చౌహాన్ అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు తేలింది. మూడుసార్లు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు పడిన రోజే ఖాతా నుంచి విత్ డ్రా చేసినట్లు నిర్దారించారు. అయితే ఎంతమేర నగదు ట్రాన్స్ఫర్ అయ్యిందో అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రమావత్ మధు అకౌంట్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) సీజ్ చేసింది. రమావత్ మధు, హిమకాంత్‌రెడ్డి, శివ చౌహాన్‌కు చెందిన అకౌంట్ల పూర్తి వివరాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తమ పేర్లను అనవసరంగా లాగుతున్నారని మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఆరోపిస్తున్నారు. కాగా, నిందితుడు రమావత్ మధు.. అధిక వడ్డీ పేరుతో వేల మంది నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.