రా ష్ట్రానికి చల్లటి కబురు

–  తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి
–  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావం తో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వొచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద ని తెలిపింది. ఈదురు గాలులు సహా పిడు గులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావ రణ శాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమి ళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.. ఎత్తు లో ద్రోణి విస్తరించి ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి/ వా యు అస్థిరత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు దుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.. ఎత్తులో విస్తరించి ఉంది. అంతర్గత మహారాష్ట్ర సహా దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.. ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూ డు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్, వరంగ ల్, ఆదిలాబాద్, విశాఖ, విజయవాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. పగలంతా ఎండ కొడుతుండగా.. సాయంత్రం మా త్రం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ చెబుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *