యాదాద్రిలో నర్సింహ స్వామి జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ స్వామి జ యంతి ముగింపు ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి అలం కరణ సేవను గురువారం ఉదయం ఊరే గింపు చేపట్టారు. యాగశాలలోని ప్రత్యేక వేదికపై అధిష్టింప జేశారు. ద్వార తోరణ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన లక్ష్మీ నృసింహ, సుదర్శవ, గరుడ మూలమంత్ర
హోమాలను శాస్త్రోక్త్రగా జరిపారు. అనంత రం ద్వారకోరణ మాషబలి మహా పుర్ణాహు ని చేపట్టి ఏకోత్తర సహస్ర కలశావీషేకము సహస్ర ఘటాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అర్చన, తదుపరి వేదస్వస్తి, సృసింహ అవిర్భావం. ఋత్విక్ సన్మానం మహాని వేధన, తీర్థ ప్రసాద గోష్ఠి ఉత్సవ పరిసమాప్తి చేపట్టనున్నారు. అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం, దబగుంటుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాల సందర్భంగా ముగింపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మక ర్త బీ.నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో నవీన్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *