వేయి స్తంభాల ఆలయంలో నృత్య ప్రదర్శనలు

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : చారిత్రక హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నాట్య గురువు బొంపల్లి సుధీ ర్ రావు ఆధ్వర్యంలోని శ్రీ శివానంద నృత్యమాల శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ ను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో యువ కళాకారిణులు రొండ్ల దక్షారెడ్డి, పెండ్యాల లక్ష్మీప్రియ, త్రివేదతోపాటు పలువురు శిష్యులు పాల్గొని తమ నృత్య ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా దక్షారెడ్డి, లక్ష్మీప్రియ ప్రదర్శించిన నృత్యాలకు భక్తులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వారి నృత్య ప్రదర్శనల్లోని హావభావాలు, లయబద్ధమైన అడుగులు, అద్భుతమైన అభినయ. నైపుణ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయ నృత్య భంగిమలతో, భక్తిభావాన్ని ప్రతిబింబించే అభినయాలతో వారు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా త్రివేదతోపాటు ఇతర కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు సైతం భక్తులను ఎంతగానో అలరించాయి. సంగీతానికి అనుగుణంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య విన్యాసాలు, ముఖ కవళికలు, సంప్రదాయ నాట్యరీతులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలను భావితరాలకు అందించడంలో నాట్య గురువు సుధీర్ రావు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *