– కర్ణాటక పరిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
– బెంగళూరులో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ రోడ్‌షో
బెంగళూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఒకే విలువ ఆధారిత గొలుసులో భాగమని, రెండు రాష్ట్రాల భాగస్వామ్యం దక్షిణ భారత ఆర్థికాభివృద్ధికి మరింత తోడ్పడుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించేందుకు బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ రోడ్‌షో విజయవంతంగా ముగిసింది. కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట’ డిసెంబర్ 7 నుండి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా జరగనుందని వివరించారు. 2034 నాటికి తెలంగాణను లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులు, ఉమ్మడి భాగస్వామ్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యాధునిక మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణ పారిశ్రామిక రంగానికి గమ్యస్థానంగా మారిందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





