– సవాల్‌పై కట్టబుడి ఉన్నందునే వచ్చానని వెల్లడి
– అబద్దాల లేఖలతో ప్రచారం చేస్తున్న హరీష్ రావు
– బిఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డ మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రిం ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు ఆయన సవాల్ విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తానని చెప్పారు. ఈ మేరకు మంత్రి జూపల్లి శుక్రవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సవాల్‌పై కట్టుబడి ఉన్నందునే ప్రెస్‌క్లబ్‌కు వచ్చానన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. తాను వెనుకడుగు వేసి పారిపోయే వ్యక్తిని కానన్నారు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు 4 పేజీల చొప్పున లేఖలు రాశా. ముగ్గురికీ వాట్సాప్‌లోనూ ఆధారాలతో లేఖలు పంపించా. రూ.4.17 లక్షల కోట్ల అప్పు అంటూ హరీశ్ రిటర్న్ లేఖ పంపారు. రూ.8.21 లక్షల కోట్ల అప్పు అని లేఖలో చెప్పా. పారిపోవడం మా ఇంటావంటా లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. లేఖలో తాను ప్రస్తావించినవి అబద్దాలని నిరూపించగలరా అని మంత్రి ప్రశ్నించారు. తాను చెప్పినవి అబద్దాలైతే రాజీనామాకు సిద్ధం అంటూ పునరుద్ఘాటించారు. హరీశ్‌రావు సొల్లు పురాణం చెబుతున్నారు. నా ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు. నేను అడిగింది ఏంటి? హరీశ్ చెప్పిందేంటి అని నిలదీసారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కోసం 3 కుర్చీలు వేశాం. హరీశ్‌రావు రాసిన లేఖలో ఏమీలేదు. ఇప్పటికైనా విలువలతో బతకండి’ అని అన్నారు. కాగా, చర్చకు రావాలని పిలిచి పోలీసులతో అడ్డుకుంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





