వివాహిత దారుణ హత్య

మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 18: చెన్నూర్ మండలంలోని ఏళ్ళక్కపేట గ్రామంలో దారుణం జరిగింది. చల్ల శారద (24) అనే వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు శారద హత్యతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శారదను హత్య చేసిన దుండగులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని, నిందితులను తమకు అప్పగించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చెన్నూరు పోలీస్ స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డట్లు సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా అధికారులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *