– లక్ష్మీ బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్న నీరు
– మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఈ పరిస్థితి వుండేది కాదు
– రేవంత్ రెడ్డి ఇకనైనా మేలుకోవాలి
– మాజీ ఎం.పి. వినోద్‌కుమార్
– మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఈ పరిస్థితి వుండేది కాదు
– రేవంత్ రెడ్డి ఇకనైనా మేలుకోవాలి
– మాజీ ఎం.పి. వినోద్‌కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్ నినో ప్రభావంపై నిన్న ఓ సందేశం పంపింది.. రిజర్వాయర్లలో నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.. అందులో మన రాష్ట్రం కూడా ఉంది అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ వర్షాలు తగ్గడం వల్ల 2027 వేసవి కాలం భయంకరంగా ఉంటుందని, ఎల్ నినో విపత్కర పరిస్థితి సృష్టించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పట్టినట్టు లేదని, మంత్రులు ఎల్ నినోపై దృష్టి నిలపకుండా సవాళ్ల విసురుతూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆరు గంటలకోసారి నదీ ప్రవాహాల సమాచారం ఇస్తుంటుంది. కాళేశ్వరం లో భాగమైన లక్ష్మి బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం 15 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాగజ్ నగర్ దగ్గర 45 వేల క్యూసెక్కుల నీరు ప్రాణహితలో ప్రవహిస్తోంది. అంటే రేపటికి 4 టీఎంసీ ల నీళ్లు లక్ష్మి బ్యారేజి వద్దకు చేరుతాయి. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయం ద్వారా ఆ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయమంటే చేయక మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. ఐదు నెలల్లో రిపేర్లు కావాల్సి ఉండగా రెండున్నరేళ్లు దాటినా మోక్షం కలగ లేద. మేడిగడ్డ దగ్గర కానాయపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి ఉంటె ఎల్ఎండి సగం నిండేది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే వచ్చే వేసవిలో స్నానానికి నీళ్లు కూడా ఉండవు. చిన్న రబ్బర్ డ్యామ్ కట్టినా, ఇసుక మేట వేసినా కన్నెపల్లి పంపులు ఆన్ చేయవచ్చు. ఎన్ డిఎస్ఏకు రాష్ట్రం మీద పెత్తనం చేసే అధికారం లేదు. మేడిగడ్డ రిపేర్లు చేస్తే ఎన్ డీఎస్ఏ వద్దన్నదా.. కేసీఆర్ ను బద్నామ్ చేయాలనే మేడిగడ్డ కు మరమ్మత్తులు చేయక రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డ ను అట్లాగే వదిలేస్తే వరదల్లో కొట్టుకు పోతుందని రేవంత్ రెడ్డి ఆశించారు. భూ కంపం వచ్చినా అది కొట్టుకు పోదు. ఎల్ నినో ప్రభావం తోనైనా రేవంత్ రెడ్డి మేలుకోవాలి.వెంటనే మేడిగడ్డ దగ్గర తాత్కాలిక అడ్డుకట్ట వేసి మోటార్లు ఆన్ చేయాలి. కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే కేవలం మూడు నెలల్లో రిపేర్లు జరిగి నీళ్లు వచ్చేవి. ఈ కరవు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే దిక్కు. పిచ్చి పిచి సవాళ్లతో కాలం వృధా చేసే బదులు మంత్రులు మేడిగడ్డకు బయలుదేరి యుద్ధప్రాతిపదికన పంపులు ఆన్ చేసేలా చర్యలు చేపట్టాలి. అనిల్ కుమార్ చీఫ్ ఇంజనీర్ హోదాలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎలా వాడుకోవాలో చెబితే ఆయనను కీలక భాద్యతల నుంచి తప్పిం చారు. ప్రాణహిత దగ్గర నీళ్లున్నా వాడుకోని అసమర్దుడిగా రేవంత్ మిగిలిపోతాడు. బండి సంజయ్ తమ్మిడిహట్టికి రెండునెలల్లో అనుమతి తెస్తా అన్నాడు ఏమైంది ? అది సాధ్యం కాదని ఆనాడే చెప్పారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని హడావిడి చేసిన రేవంత్ రెడ్డి ఇపుడా అంశం ఎందుకు మాట్లాడటం లేదు. 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టి సాధ్యం కాదు కాక కాదు. ఎనిమిది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచి ఏం లాభం. రాజకీయ స్వార్థాలు పక్కన బెట్టి మేడిగడ్డ నుంచి వీకైనంత తొందరగా నీళ్లు పంప్ చేస్తేనే తెలంగాణ ఎల్ నినోను ఎదుర్కోగలదని ప్రభుత్వం గ్రహించాలి. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి, గట్టు రామచంద్రరావు, సత్యనారాయణ, కళ్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





