– కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారిందన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 20 శాతం మాత్రమే భరిస్తోందని, పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వాటాను గణనీయంగా పెంచాలని కోరారు. టీనేజ్ బాలికల్లో రక్తహీనత (అనీమియా) సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రత్యేక ఆహార పంపిణీ కోసం రూ.100 కోట్లT మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని మంత్రి సీతక్క కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





