ఐ అండ్ పీఆర్ అదనపు సంచాలకుడిగా జగన్‌కు పదోన్నతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్.జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జగన్ సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌కు మంత్రి అభినందనలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంతోపాటు ప్రభుత్వం, ప్రజలు, మీడియా మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి.ముకుంద రెడ్డిని కూడా జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మాట్లాడుతూ తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయడంలో శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తానన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *