– రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలి
– ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు
– మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : షాబాద్ లో జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్య తరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కల చివేసిందని, ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచే స్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోక్సో కేసు నిందితడు ముగ్గురు పసిపిల్లలు సహా ఒకే రాత్రి ఆరుగురిని ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కిరాతకంగా చంపేయడం రా ష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యమని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే తక్షణమే తన ముఖ్య మంత్రి, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల నిర్లక్ష్యమే
మే 16న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమ య్యారని హరీశ్ రావు ఆరోపించారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు నిందితుడికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారన్నారు. “మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి” అని ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. సరైన సమయంలో ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిలో సమీక్ష చేసి కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే ఈరోజు ఈ ఆరు హత్యలు జరిగేవి కావన్నారు. నెల రోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతోనే అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఈరోజు కుటుంబాన్నే అంతం చేశాడని దుయ్యబట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





