ఏడుగురు ‘ఆప్’ ఎంపీల విలీనానికి రాజముద్ర

– వీరంతా బీజేపీలో చేరినట్లు గుర్తించిన చైర్మన్
– రాజ్యసభలో 113కు చేరిన బీజేపీ సంఖ్యాబలం
– మూడుకు పరిమితమైన ‘ఆప్’ సభ్యులు

న్యూదిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇపుడు బీజేపీ సంఖ్యాబలం 113కి పెరిగింది. ఆప్ సభ్యుల సంఖ్య పదినుంచి మూడుకు పడిపోయింది. ఆప్ నుంచి రాఘవ్ చద్దా, సాందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతీ మాలివాల్ సహా ఏడుగురు సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగా పరిగణించాలని కోరుతూ వీరు రాజ్యసభ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించగా తాజాగా ఆమోదం లభించింది. కాగా, తమ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ ‘ఆప’ రాజ్యసభ చైర్మన్‌కు ఆదివారం వినతిపత్రం సమర్పించింది. కేంద్ర సంస్థలను ఉపయోగించి తమ నాయకులను ఒత్తిడి చేసి బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించింది. ఈ అంశంపై చట్టపరమైన పోరాటం కూడా కొనసాగుతుందని తెలిపింది. రాజ్యసభ వెబ్‌సైట్ ప్రకారం బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరగా ఎన్డీయే బలం 141 నుంచి 148కి పెరిగింది. బీజేపీలో చేరినట్లు ఆమ్ ఆద్మీ పార్టీలు సమర్పించిన విలీన లేఖపై రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీల సంఖ్యలో ఏడుగురు ఫిరాయించేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారంc 2/3 మెజారిటీ ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *