– 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూప్రకంపనలు
– తొలుత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2 కాగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో
– నేలమట్టమైన భారీ భవనాలు, ఇళ్లు, భవన సముదాయాలు
– ప్రాథమిక సమాచారం మేరకు 32 మంది మృతి
– దాదాపు శతాబ్దకాలం తరవాత అతిపెద్ద భూకంపంగా నమోదు
కారకాస్, జూన్ 25 : వెనిజువెలాలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో రెండుసార్లు భారీ భూకంపం వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండుసార్లు భూమి కంపించింది. తొలుత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2 కాగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు శతాబ్ద కాలం తరవాత అతిపెద్ద భూకంపంగా నమోదు అయింది. భూకంపాల ధాటికి భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. లా గౌరియా ప్రాంతం తీవ్రంగా ప్రభావానికి గురైంది. భూకంపాల వల్ల 32 మంది మృతిచెందగా, 700మంది గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. వీలైనంత వరకు అందర్నీ రక్షిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, లా గౌరియా రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. దేశ రాజధాని కారకాస్‌కు పశ్చిమ దిశలో 168 కి.విÖ దూరంలో ఉన్న కరీబియన్ తీరంలోని మోరన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సుమారు 22 కి.విÖ లోతులో భూమి కంపించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య లక్ష వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు యÖఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. కరేబియన్ తీరంలోని మోరోన్ పట్టణానికి పశ్చిమాన 21 కి.విÖ దూరంలో 7.2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. అదే పట్టణానికి సుమారు 45 కి.విÖ దూరంలో క్షణాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 10 వేల నుంచి లక్ష మంది వరకూ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని యÖఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. అలాగే వేలమంది ప్రజలు గాయపడి ఉండొచ్చని తెలిపింది. భూకంపాలతో అనేక భవనాలు నేలమట్టం కాగా, ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న అనేక వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మొదటి భూకంపం వచ్చినప్ప్పుడు ఒక్కసారిగా పెద్దపెద్ద భవనాలు కూలిపోవడం ప్రారంభమయ్యాయి. అనేక చిన్నచిన్న ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఏం జరుగుతుందో గ్రహించి ప్రాణరక్షణ కోసం ప్రజలు పరిగెత్తే లోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో రెండో భూకంపం వచ్చింది. దీంతో భారీ విధ్వంసం జరిగింది. కొన్ని భారీ భవనాలు కూలిపోగా, మరికొన్ని ఊగిపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్ప్పులు కూలిపోగా శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారు. మరోవైపు వెనెజువెలాలోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్ప్పు కూలిపోయింది. ఆ టెర్మినల్ మొత్తం దుమ్ముతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు తమ లగేజీ పట్టుకుని ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు లోపలే ఓ ఫుడ్ కౌంటర్ వద్ద ఆశ్రయం పొందారు. తీరప్రాంత నగరమైన లా గువైరాకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. వరుస భూకంపాలతో కూలిపోయిన భవనాలు, గాలిలోని దుమ్ము, నిర్మానుష్యంగా మారిన రహదారులు అందులో కనిపించాయి. వెనెజువెలా రాజధాని కారకాస్‌లోనూ భారీ విధ్వంసం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. స్థానికులు ప్రాణభయంతో కేకలు వేసిన దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి. మరో వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కల ప్రాణాలు కాపాడిన దృశ్యాలు కనిపించాయి. కూలిపోయిన తమ ఇంటి నుంచి అతి కష్టంవిÖద అతడు కుటుంబ సభ్యులను కాపాడుకున్నాడు. ఆ తర్వాత తన రెండు కుక్కలనూ ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాడు. జంట భూకంపాల అనంతరం అధ్యక్షురాలు రోడ్రిగేజ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కూడా ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
జాతీయ సెలవు దినం కావడంతో ప్రజలంతా ఇంటివద్దే 
శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని, దాంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘ఈ భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు రావొచ్చు.. దాంతో ఈ విపత్తు విధ్వంసకరంగా ఉండొచ్చు.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది.. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చ’ని యÖఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇళ్లను వదిలి బయటకు రావాలంటూ భూకంపాల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లకున్న పెట్రోల్ సరఫరాను నిలిపివేసినట్లు వెల్లడించింది. కొన్ని భవనాలు కూలిపోగా మరింతగా నష్టం వాటిల్లకుండా ఈ చర్యలని పేర్కొంది. జూన్ 24.. వెనెజువెలాలో నేషనల్ హాలిడే. దాంతో ఎక్కువమంది ఇళ్లలోనే ఉన్నారు. ఈ విపత్తులో భారీగా మరణాల సంఖ్య ఉండొచ్చని అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తన సందేశంలో పేర్కొన్నారు. రెండు భారీ భూకంపాల తర్వాత 20 వరకు ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి మెక్వెషియా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో దాన్ని మÖసివేసి పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. రాజధానితోపాటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మÖసివేశారు.
వెనిజువెలాకు మోదీ ఆపన్నహస్తం : సాయం అందిస్తామని ప్రకటన
న్యూదిల్లీ : వెనెజువెలాను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం సాచాయి. వెనెజువెలా విలయంపై భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని, సహాయ సహకారాలు అందిస్తామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వెనెజువెలా ప్రజలకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని అన్ని ఏజెన్సీలను ఆదేశించామన్నారు. ఇప్పటికే సహాయక బృందాలను మోహరించామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




