ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు

– 19 సాయంత్రం వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు
– మేనేజ్‌మెంట్ కోటా ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ఎంబీబీఎస్ అడ్మిషన్ల కన్వీనర్ కోటా సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపును 2026-27 విద్యా సంవత్సరానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎనఆర్‌యÖహెచఎస్) మంగళవారం విడుదల చేసింది. కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కన్వీనర్ కోటా సెకండ్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19న సాయంత్రం 4 గంటల లోపు తమకు సీట్లు కేటాయించిన కాలేజీల్లో చేరాలి. చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలని యూనివర్సిటీ తెలిపింది. అలాగే, మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల ఫస్ట్ ఫేజ్ కేటాయింపులను కూడా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటల లోపు తమకు సీట్లు కేటాయించిన కాలేజీల్లో చేరాలి. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర పత్రాలను సమర్పించి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ అకడమిక్ సెషన్ 15 నుంచి ప్రారంభమైందని యూనివర్సిటీ తెలిపింది. విద్యార్థులు నిర్ణీత గడువులో తమ అడ్మిషన్లను పూర్తి చేసుకోవాలని సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *