హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 30లోగా టీజీవోబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. పథకానికి సంబంధించిన సమాచారం అర్హులైన ప్రతి మహిళకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





