హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : చేయÖత నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మరో రోజు గడువు పొడిగించారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు జిల్లాల అధికారులకు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 5.78 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో గడువు ముగిసింది.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





