– మహిళా సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుందని, సంక్షేమం, అభివృద్ధి మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ గత బీఆరఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తే ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలను ఏకీకృతం చేసి ఆ సంఘాలకు రుణాలపై బీమా, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు అందిస్తూ వ్యాపారులుగా మారుస్తున్నదని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వడమే కాక సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో మహిళా సంఘాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాలు అవసరమైనచోట ఇస్తున్నామని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





