•వేములవాడ రాజన్న దేవస్థానంలో అట్టహాసంగా మొదలైన వేడుకలు
•రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన
మంత్రి పొన్నం
•టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం
•అట్టహాసంగా ప్రారంభమైన శివార్చన
•సర్వాంగ సుందరంగా ముస్తాబైన వేములవాడ క్షేత్రం
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశి వరాత్రి వేడుకలు మంగళవారం ఉదయం వైభవ ంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవా లకు దేవస్థాన పరిసరాలతోపాటు వేముల వాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. మంగళవారం రాత్రి వరకు 60 వేలకుపైగా భక్తులు వేములవాడకు చేరుకు న్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మరో మూడు లక్షల భక్తులు వేములవాడకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర రవాణ శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడకు చేరుకుని, ఆది శ్రీనివాస్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ తరపున రాజరాజేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం టిటిడి అర్చక బృందం వేములవాడకు చేరుకుని శ్రీస్వా మివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం మంగళవారం రాత్రి నుంచి గురు వారం ఉదయం వరకు కొనసాగే రాష్ట్ర సాంస్కృతిక శాఖ, దేవస్థానం వారు సం యుక్తంగా రూ.కోటికి పైగా వ్యయంతో చేపట్టిన శివార్చన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు ప్రారంభించారు.
మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఉదయం 3 గంటల వరకు స్థానిక భక్తులు శ్రీస్వామివారికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించడంతో వేలాది స్థానికులు రాత్రి 11 గంటల నుండే క్యూలైన్లలో బారులు తీరారు.వీరంతా ఆలయంలోకి చేరుకుని శ్రీస్వామివారికి అభి షేకం చేసే సమయంలో మహామండపంలో రద్దీ అధికమైంది.ఈ రద్దీని క్రమబద్దీకరించడానికి సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఉత్సవాలను ఎప్పటి కప్పుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ,బందోబస్తును అఖిల్ మహాజన్ లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బందికి తగిన సూచనలిస్తున్నారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రికి వేము)వాడకు విచ్చేసే భక్తులకోసం ఆర్టీసి వారు వేములవాడ బస్ స్టేషన్ నుంచి దేవస్థానం వరకు 14 ఉచిత బస్సులను నిర్వహిస్తున్నారు. స్థానిక వాసవీ సేవాసమితి వారు, వేములవాడ అన్నదాన ట్రస్టువారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దానిని ఎమ్మెలే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.అంతేగాకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం, భోజన శిబిరాన్ని సైతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
దీనికి తోడుగా వేములవాడ అన్నదాన ట్రస్టు వారు మహాశివరాత్రి రోజున భక్తులకు ఉచితంగా అరటి పళ్లు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేయనున్నారు.వేములవాడకు చెందిన వ్యాపారవేత్తలు ఉచితంగా మజ్జిగ పాకెట్లు, పాలను పంపిణీ చేయనున్నారు. వేములవాడలోని పలు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు, స్థానికులు ఉచిత ప్యూరిఫైడ్ వాటర్‌ను పంపిణీ చేయడానికి వాహనాలను సమకూర్చారు. వేములవాడలోని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మజ్జిగ పాకెట్లు, నీటి పాకెట్ల పంపిణీని చేయనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వాహనాలను వేములవాడలోని మేన్ రోడ్డులోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుని, ఆ వాహనాలన్నింటిని పార్కింగ్ స్థలాలకు తరలించడానికి చర్యలు తీసుకున్నారు. ఆర్టీసి వివిధ ప్రాంతాల నుండి వెయ్యి బస్సుల ద్వారా భక్తులను వేములవాడకు చేరవేయడానికి ఏర్పాట్లు చేసింది.
మేన్ బస్‌స్టేషన్‌తోపాటు కట్టకింద మరో తాత్కాలిక బస్ స్టాండ్‌ను ఏర్పాటు చేసి అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించారు. దేవస్థానం ఆవరణలో భక్తులు బస చేయడానికి వీలుగా పందిళ్లను వేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, నల్లాలను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించిన నివారించడానికి అగ్నిమాపక సిబ్బంది వారు రెండు ఫైరింజన్లతో సిద్ధంగా ఉండగా మొబైల్ వాహనాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు పవిత్ర స్నానాలు అచరించే ధర్మగుండాన్ని నీటితో నింపారు. ఈ ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1500లకు పైగా పోలీస్ సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు తీవ్ర సమస్యలతో బాధపడే వారిని ఏరియా దవాఖానకు తరలించడానికి వీటుగా అంబులెన్సును సిద్ధంగా ఉంచింది.





