– ఈసారి మూడు కార్పొరేషన్ల పరిధిలో నిర్వహణ
– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– భక్తులకు సౌకర్యాల కల్పనýకు పటిష్ట చర్యలు
– దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– భక్తులకు సౌకర్యాల కల్పనýకు పటిష్ట చర్యలు
– దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల భక్తి, ప్రజల విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం నిర్వహించిన ఆషాఢమాస బోనాల సమన్వయ సమావేశంలో ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆమె జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదûశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడూ ఒక్క కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోనే నిర్వహించే ఈ ఉత్సవాలను ఈసారి మూడు కార్పొరేషన్ల (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు..హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో జూలై 16న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గత కొన్నేళ్లుగా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గణనీయంగా పెరిగిందని, ఈ నిధులను ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాట్లకు సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, రైల్వే, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ రద్దీ ఉండే ఆలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతల కోసం లాక్టేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి తాకిడి ఉండనున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నంను కోరారు. ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డీజీపీ సి.వి.ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.పి.సజ్జనార్, ధార్మిక సలహాదారు గోవింద్ హరి, ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ, పోలీసు, విద్యుత్, ఆరఅండ్‌బీ, వాటర్ వర్క్స్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మెట్రో, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





