” మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది.”
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తైంది. సగం పదవి కాలం ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు.సొంత పార్టీలో విభేదాలను, మంత్రులు, నేతల మధ్య ఐక్యత సాధించడం లేదు. కానీ తన పాలన వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కుమ్ములాటలపై ప్రజల్లో చర్చ జరగకుండా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణాలు, వ్యక్తిత్వ హననం చేస్తూ వెండేటా రాజకీయాలు చేస్తున్నారు. కేసులు విచారణల పేరుతో ఎన్ని వేధింపు రాజకీయాలు కాంగ్రెస్ చేసిన బీఆర్ ఎస్ నాయకులూ సమన్వయంతో సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టుతున్నారు. రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ విజయవంతంగా పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర, ప్రజల్లో గులాబీ పార్టీకి పెరుగుతున్న ఆధారణ, కాంగ్రెస్‌పై రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత ఇందుకు నిదర్శనం.
ప్రతిపక్షం గురించి కొంచెం సేపు పక్కన బెట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరకు వద్దాం. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్నట్లు. రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చేందుకు ఆ పార్టీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే కత్తికి కాంగ్రెస్ బలైతోంది.అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి..నేతలు మంత్రులు ముఖ్యమంత్రి మధ్య విభేదాలు భగ్గుమంటూ బయపటపడున్నాయి. ప్రతిపక్షంలో లేని విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తూ పార్టీ నుంచి తరిమేసిన వాళ్ల సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న సీఎం, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్షాలు కాదు. అధికారంలో ఉండి కూడా గ్రూప్ తగాదాలు, గుంపు రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ముందు మీ పార్టీ నేతలు మీ ప్రభుత్వంపై, మీ పాలనపై, మీ విధానాలపై ప్రశ్నిస్తున్నారు.పార్టీలో కులాధిపత్యంపై నిలదీస్తున్నారు. అధికార పార్టీ నేతలు రోడ్లపై తన్నుకుంటున్నారు.దాడులు చేసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎక్కువ విమర్శలు చేస్తున్నారు.స్వయంగా సొంత కేబినెట్ సహచర మంత్రులే సీఎంను ఓపెన్‌గా విమర్శిస్తున్నారంటే కాంగ్రెస్ దీనపరిస్థితి, కుమ్ములాటలకు ఉదాహరణ. మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై నిఘాపెట్టడం, అధికారులను బదీలి చేయడం, అవినీతి పేరుతో మంత్రులకు చెప్పకుండానే విజిలెన్స్ ఎంక్వైరీలు చేయడం, ఆయా శాఖల్లో మంత్రులకే చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం జీఓ లు జారీ చేయడం, మంత్రులపై అవినీతి ముద్రవేస్తున్నారని సొంత మంత్రులు, నేతలే మాట్లాడుతున్నారు వాటిపై సీఎం కమ్ టీపీసీ చీఫ్ సమాధానం చెప్పాలి.ముందు మీ పార్టీ నేతల ప్రశ్నాలకు సమాధానం చెప్పాలి.మీ ఇళ్లే చక్కదిద్దుకోని మీరు పక్కింటోళ్ల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు.
ఇక ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నియోజక వర్గాల్లో వర్జినల్ డూబ్లికేట్ కాంగ్రెస్ మధ్య వైరం కొనసాగుతుంది. పారాష్యూట్ నేతలకు మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల మధ్య అగ్గి రాజుకుంటోంది. జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీల మధ్య విభేదాలు నివురుగప్పిన ఉన్నాయి. తుంగతుర్తి, వరంగల్ వంటి చోట్ల ఇప్పటికే బయటపడ్డాయి.అన్నీ బయటపడపోయిన జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. నిన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. దళిత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వాయిస్ వినిపిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీలో అణచివేతలపై గొంతు గొంతు కలుపుతారు గొంతెత్తున్నారు. తమది దళితుల పక్షపాత ప్రభుత్వం , పార్టీలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పుకునే కాంగ్రెస్. ఇవాళా ఆ పార్టీ ఎమ్మెల్యేలే అదంతా తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.ఎంత అసంతృప్తితో ఉంటే ఇలా అధికారంలో ఉండి కూడా బయట అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎంత వేదన అనుభవిస్తే వాయిస్ వినిపిస్తారు.
ఇదేనా దళిత ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం..?.ఇదేనా దళితులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ.?. అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇదేనా దళిత పక్షపాత ప్రభుత్వం.? అంటూ నిలదీస్తున్నారు.కాంగ్రెస్ కేవలం దళిత ప్రజా ప్రతినిధులనే కాదు వాళ్ళకు వోట్లేసిన కోట్లాదిమంది దళితులను అవమానిస్తుంది. వాళ్ళు రిజర్వుర్డ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారంటే వాళ్ళు కోట్లాది మంది దళితులకు ప్రతినిధులు. అలాంటి దళిత ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటే దళిత సామాజం ఆలోచించాలి. .ఎస్సీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు అంటూ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు..దళిత ఎమ్మెల్యేలతో పాలాభిషేకాలు, సత్కారాలు ముఖ్యమంత్రి చేయించుకున్నారు మరీ ఇదేంటి..?. ఎందుకు దళిత ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీరు, పార్టీ వ్యవహార శైలిని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.?. అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు.
మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. డిప్యూటీ సీఎంకు, నల్లగొండ మంత్రులకు సీఎం చెక్ పెట్టాలని చూస్తే ,సీఎం కే చెక్ పెట్టే ప్రయత్నం ఆ మంత్రులు చేస్తున్నారనా అన్న చర్చ ఇంకోవైపు జరుగుతుంది. అంతే కాదు మరో చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే దళిత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు దూరం చేసి, బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది.
దేశంలో బీజేపీ అన్నీ రాష్ట్రాల్లో గెలుపు రహస్యం కూడా దళిత్ కార్డ్ ప్రధాన అస్త్రం.. దేశంలో కాంగ్రెస్ కు దళితులు దూరం అవుతుంటే బీజేపీ రోజు రోజు దళితులకు దగ్గర అవుతోంది. యూపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మహారాష్ట్ర హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అయితే తెలంగాణలో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు..రాష్ట్రంలో బీజేపీకి ఒంటరిగా దళితవాదం పని చేయడం లేదు.అందుకే దళితులు బీజేపీకి దగ్గరవ్వడం లేదు. ఉంటే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ తో ర్యాలీ అవుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దళితులను చిన్న చూపు చూస్తూ అవమానాలకు గురి చేస్తే వాళ్ళు పరోక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు.
రెండు సార్లు బీఆర్ఎస్ పాలన చూసిన దళిత ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తారని రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అంటున్నారు విమర్శకులు.అంతేకాదు దళిత ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తే ఆటోమేటిక్ గా దళితులు కూడా వాళ్ళతో పాటు దళితులు కూడా వెళ్ళుతారని ముఖ్యమంత్రి ఆలోచన కావొచ్చు అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. బీజేపీ కూడా దళిత్ కార్డ్ ఎజెండాతో వ్యూహాలు మొదలు పెట్టింది.ప్రభుత్వంలో పార్టీలో దళితులను అవమానాలకు, అణిచివేతకు గురి చేస్తే వాళ్ళు పరోక్షంగా బీజేపీ లాభం చేస్తుందన్న ఉద్ధేశ్యంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమౌతోంది. అటు మొన్న హైద్రాబాద్‌లో బీసీ యాదవ మహిళ నేతపై సొంత పార్టీ నేత, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చే గౌవరం ఏంటో అర్థమైంది..దళితులను బీసీలను కాంగ్రెస్ వోట్లేసే యంత్రాగాలుగానే చూస్తున్నారన్నది స్పష్టమైతోంది.
అయితే రాష్ట్రంలో భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ మళ్లీ గెలిచే చాన్స్ లేదని గ్రహించిన టీకాంగ్రెస్‌లో ముఖ్య నేత ఫ్యూచర్‌లో బీజేపీలో చేరి ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ముఖ్యమంత్రి కావొచ్చని ఆశలు పెట్టుకున్న నేత రాష్ట్రంలో దళితులు, బీసీలను బీజేపీ దగ్గరకు చేసే పొలిటికల్ ఎజెండాను సెట్ చేయడంలో భాగంగానే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను బహిర్గతమయ్యేలా చేస్తూ కాంగ్రెస్ ను బలహీనపర్చి బీజేపీని బలోపేతం చేసే ఎజెండాను అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతం.సదరు నేత కుట్రలను తిప్పికొట్టుతారా. కుట్రలకు బలైతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పుతుంది. -తోటకూర రమేష్





