మద్యం షాపు టీచర్ పై వేటు!
ప్రజాతంత్ర కథనానికి స్పందనగా సస్పెండ్ చేసిన డీఈఓ
‘సర్వీస్ రూల్స్’ ఉల్లంఘన: మద్యం లాటరీ వివాదంపై జిల్లా విద్యాశాఖ సంచలన నిర్ణయం.
మహబూబ్ నగర్ ,ప్రజాతంత్ర నవంబర్ 1.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుష్ప మద్యం షాపు లాటరీలో గెలుపొందడం.. దీనిపై వచ్చిన వార్త ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆమెను సస్పెండ్ చేశారు.
“ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉంటూ మద్యం దుకాణం లాటరీ (లక్కీ డ్రా) దక్కించుకోవడంపై వచ్చిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ‘ప్రజాతంత్ర’ దినపత్రికలో వచ్చిన ‘ఉపాధ్యాయులకు మద్యం’ శీర్షికపై చర్యలు తీసుకుంటూ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాల కు చెందిన ఉపాధ్యాయిరాలు పుష్ప ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
’ప్రజాతంత్ర’ దినపత్రిక వరుస కథనాలతో స్పందించిన విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహించడానికి ప్రయత్నించారని ప్రజాతంత్ర ప్రతినిధితో డిఇఓ స్పష్టం చేశారు.

దీనిపై డీఈఓ
: “ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపారాలు నిర్వహించడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం. ఇటీవల జరిగిన మద్యం షాపుల లాటరీలో ఈ ఉపాధ్యాయినికి షాపు దక్కడంతో పాత డీలర్లు లేదా ఇతరులు దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రజాతంత్ర దినపత్రికలో సవివరమైన కథనం ప్రచురితమైంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తప్పవని అంతకుముందే జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.





