పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం

– ఈసీ నోటీసులపై దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్‌

‌న్యూదిల్లీ, జూలై 7: పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కల్వకుంట్ర కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ  ఖరారుపై కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తమ పార్టీ పేరును ఖరారు చేయడానికి ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్‌ 23‌న లేఖ పంపిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు ప్రత్యామ్నాయమైన పార్టీ పేర్లు చెప్పాలి తప్ప.. టీఆర్‌ఎస్‌ ‌వచ్చే విధంగా ఎలాంటి పేరు ఉండొద్దని ఈసీ తెలిపిందని కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ రక్షణ సేన పేరు టీఆర్‌ఎస్‌కు అర్థం వచ్చేలా ఉందని, ఈసీ నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు సూచించింది. పిటిషన్‌ ‌విచారణకు చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *