హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను గట్టి భద్రత నడుమ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




