హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి, గ్రామీణ పాలనలో పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ పంచాయతీ మాసపత్రికను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం ఆవిష్కరించారు. ఈ పత్రిక ద్వారా ప్రతి నెలా పంచాయతీరాజ్ శాఖలో జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామీణాభివృద్ధి పనులు, ఉద్యోగుల సమస్యలు, విజయాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించనున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నూతన ఆలోచనలు, సూచనలకు కూడా ప్రాధాన్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అండ్ తెలంగాణ పంచాయతీ మాసపత్రిక ఎడిటర్ అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ల్యాప్టాప్లు/టాబ్లు అందించాలని మంత్రి సీతక్కను కోరారు. వీటి ద్వారా డిజిటల్ సేవల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ట్రిబ్యునల్ మెంబర్ నాగులూరి కృష్ణ కుమార్, అంబటి శ్రీనివాస్, టీజీఐఆర్డీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, డిప్యూటీ సీఈవో వెంకన్న, డీఎల్పీవో సతీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సురేందర్, ఈటీసీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్, రిపోర్టర్లు ఎ.తిరుపతి, గోపి, ఎంపీవోల సంఘం ప్రతినిధి రమేష్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





