సివిల్ సర్వీసెస్ అధికారుల హెరిటేజ్ వాక్

– నిర్వహించిన పర్యాటక, వారసత్వ శాఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శిక్షణలో ఉన్న సుమారు 170 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం రాష్ట్ర పర్యాటక, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వారసత్వ పర్యటన శనివారం నిర్వహించారు. ఈ వాక్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద ప్రారంభమై ప్రసిద్ధ చారిత్రక భవనం చౌమహల్లా ప్యాలెస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకT హైదరాబాద్ నగర చరిత్ర, విశిష్ట నిర్మాణ శైలి, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. హైదరాబాద్ నగర సాంస్కృతిక గుర్తింపులో ఈ చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను, వాటి చారిత్రక నేపథ్యాన్ని శిక్షణలో ఉన్న అధికారులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక సంపదపై అవగాహన కల్పించడంతో పాటు, రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ పర్యటన ఒక భాగం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *