‘కళావేదిక’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. శ్రీపాదరావు మిత్రుడైన ఆర్.వి.రమణమూర్తి 1960వ దశకంలో కళావేదికను స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న కళావేదికతో శ్రీపాద రావుకు ఎంతో అనుబంధం ఉండేది. ఆయన 20 ఏళ్లపాటు ఈ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సంస్థ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళావేదిక మాసపత్రిక ఎడిటర్ భువన రాయవరపు, సభ్యులు కొమర్రాజు రవికుమార్, పుట్టంరాజు సీతారామ్‌లు ప్రత్యేక సావనీర్ తొలి కాపీని శ్రీధర్‌బాబుకు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *