ఎక్సైజ్‌ ‌శాఖలో డిప్యూటీ కమిషనర్ల బదిలీ

– గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌డీసీగా శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్‌ ‌శాఖలో డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ ‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జె హరికిషన్‌ను సైబరాబాద్‌ ‌డీసీగా, నల్గొండలో డీసీగా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్‌రెడ్డిని గ్రెటర్‌ ‌హైదరాబాద్‌ ‌డీసీగా బదిలీ చేశారు. రంగారెడ్డి డీసీగా ఉన్న దశరథను టీజీబీసీఎల్‌ ‌డీసీగా, ఖమ్మంలో డీసీగా ఉన్న జనార్దన్‌ ‌రెడ్డి ఆదిలాబాద్‌ ‌డీసీగా బదిలీ చేశారు. టీజీబీసీఎల్‌ ఆర్‌ఆర్‌-1‌లో ఉన్న దాతురాజు గౌడ్‌ను వరంగల్‌ ‌డీసీగా, నిజామాబాద్‌లో ఏసీగా ఉన్న వి.సోమిరెడ్డిని ఖమ్మం డీసీగా, కరీంనగర్‌ ‌బీసీఎల్‌లో మేనేజర్‌గా ఉన్న రవీకుమార్‌ను కరీంనగర్‌ ‌డీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లేబుల్స్‌లో పనిచేస్తున్న పి శ్రీధర్‌ను నిజామాబాద్‌ ‌డీసీగా, హెడ్‌క్వార్టర్స్‌లో డీసీగా ఉన్న కె రఘురాంను రంగారెడ్డి డీసీగా, హైదరాబాద్‌ ఏసీగా ఉన్న ఏ అనిల్‌ ‌కుమార్‌ ‌రెడ్డిని ఈస్ట్ ‌జాయింట్‌ ‌డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్‌లో ఏసీగా ఉన్న పి ప్రణవిని మల్కాజిగిరి డీసీగా, మహాబూబ్‌ ‌నగర్‌ ఏసీ విజయ్‌ ‌భాస్కర్‌ ‌రెడ్డి డీసీ అక్కడే పదోన్నతి కల్పించింది. బ్రేవర్సీలో ఏసీగా ఉన్న చంద్రయ్యను మెదక్‌ ‌డీసీగా, ఈస్ట్ ‌జాయింట్‌ ‌డైరెక్టర్‌గా ఉన్న సీవీ శశిధర్‌ ‌రెడ్డిని నల్గొండ డీసీగా బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *