హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అలాగే సగరుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ కలియుగంలో కూడా భగీరథుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతుండడం హర్షణీయమన్నారు. దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన మహానీయుడు భగీరథుడు అని కొనియాడారు. భగీరథ ప్రయత్నం అంటూ ఆయన పేరును తలుచుకుంటూ నేటి సమాజం ముందుకు సాగుతోందన్నారు. బసవేశ్వరుడు పేరులోనే దేవుడు ఉన్నాడని చెబితే పని సాధించే వరకు ప్రయత్నం చేయాలని భగీరథుడు చెప్పాడన్నారు. భగీరథుడిని దిక్సూచిగా తీసుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని నేటి యువత ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈfల రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంఘం నాయకులు ఉప్పరి శేఖర్, ఆస్కానీ మారుతిసాగర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





