– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల 15న ఉదయం 10 గంటల నుంచి వాట్సాప్ ద్వారా తమ హాల్ టికెట్లను వెంటనే పొందవచ్చు. డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 21, 22 తేదీల్లో జరగనుంది.
హాల్ టికెట్ పొందే విధానం
అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096ను మీ సేవ తెలంగాణ పేరుతో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ (Hi) అని మెసేజ్ పంపాలి. డీఈఈసెట్ హాల్ టికెట్ అని టైప్ చేయాలి. మెనూలో కనిపించే ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ ఐడీ, అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సమర్పించిన వెంటనే డీఈఈసెట్ హాల్ టికెట్ వాట్సాప్‌లో అందుతుంది.
ఈ సేవ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకంగా, సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీ సేవ ద్వారా పౌర సేవలను మరింతగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. గత ఏడాది నవంబరు 18న ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిజిటల్ సేవల వేదిక అయిన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవల ద్వారా ప్రజలకు మరింత సులభంగా ప్రభుత్వ సేవలను అందిస్తోంది. మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ వేదిక అత్యంత వేగంగా ప్రజాదరణ పొందిన డిజిటల్ పౌర సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది.
అత్యధికంగా వినియోగిస్తున్న సేవలు
జనన ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, పోలీస్ చలాన్ సేవలు, విద్యుత్ బిల్లు సేవలు, బీఐఈ ఫలితాల సేవలు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





