కాళేశ్వరంపై కెటిఆర్‌ ‌మాటలు సిగ్గుచేటు

– వారి హయాంలోనే కట్టడం.. కూలడం చూశాం
– దీనిపై ఇంకా సమర్థించుకోవడం సిగ్గుచేటు
– ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక మేరకు చర్యలు
– మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌

న్యూదిల్లీ, జూలై 29 :కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌ ‌మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారని అన్నారు. వారి హయాంలోనే కట్టడం, కూలడం రెండూ జరిగాయని అన్నారు. దీనిపై ఇంకా సమర్థించుకునే చర్యలు సిగ్గుచేటని అన్నారు. వారు సరిగా కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని మండిపడ్డారు. బ్యారేజీలో 2..3 టీఎంసీలు నిల్వ చేయమంటే 10 టీఎంసీలు ఎందుకు స్టోర్‌ ‌చేశారని ప్రశ్నించారు. దిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ.. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిపుణుల సాయంతో వీలైనంత త్వరగా బ్యారేజీ మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంపై అంతర్జాతీయ నిపుణులతో, ఎన్డీఎస్‌ఏ అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ ‌ఢిల్లీలో డియాతో మాట్లాడుతూ తెలిపారు. మూడు బ్యారేజ్‌లను టెస్టింగ్‌ ‌చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో రిహబిలిటేషన్‌ ‌డిజైన్స్ ‌వర్క్ ‌పూర్తి చేస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపడతామని తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.కాళేశ్వరాన్ని కేసీఆర్‌ ‌ప్రభుత్వం సరిగ్గా కడితే ఈ సమస్య వచ్చేది కాదని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. కాళేశ్వరం కూలిపోవడానికి ప్రధాన కారణం నాసిరకం డిజైన్‌, ‌నాసిరకం నిర్మాణమేనని వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ ‌కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ‌నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తమకు ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలనే విషయాన్ని ఎన్డీఎస్‌ఏ అధికారులు స్పష్టం చేశారని అన్నారు. కాపర్‌ ‌డ్యాం కట్టాలా, వద్దా అని ఎన్డీఎస్‌ఏ అధికారుల సలహా ప్రకారమే నడుచుకుంటామని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై నేషనల్‌ ‌డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ‌సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో ఈ సక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఎన్డీఎస్‌ఏ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.హైడ్రాపై ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైడ్రాపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తాను మాట్లాడటం సబబు కాదని చెప్పుకొచ్చారు. మున్సిపల్‌ ‌శాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *