ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరికి రామన్న భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహ కుమార్తె గౌరి వైద్య విద్య‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించ‌గా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, చదివించడం కష్టసాధ్యంగా మారింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ అక్టోబర్ 2024లో మొదటి సంవత్సరం ఫీజును చెల్లించారు. రెండో సంవత్సరానికి సంబంధించిన రూ.1.30 లక్షల ఫీజు చెక్కును విద్యార్థిని గౌరికి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా గౌరి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువు కొనసాగేందుకు అండగా నిలిచిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *