– బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి
– కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బ్జడెట్ అవసరాలకు అను గుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి లోతుగా సమీక్షించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బ్జడెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సకరణ జరగాలని స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న టైమ్ లైన్ ప్రకారమే అన్ని శాఖల అధికారులు ఆదాయాన్ని పెంపొందించేందుకు శ్రమించాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అనివార్య కారణాలవల్ల సమావేశానికి కాలేని వారు వీసీ ద్వారా హాజరవ్వాలని ఆదేశించారు. ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ క”మార్ రెడ్డి అధికారులను అధికారులను ఆదేశించారు. కేబినెట్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు అమలులోకి రానున్నాయని అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. దీని ద్వారా రిజిస్టేష్రన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్ సిద్ధమయ్యాయని, వీటికి సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే వెలువడనున్నాయని అధికారులు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్టేష్రన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రెవెన్యూ, రవాణా తదితర కీలక శాఖలలో ప్రస్తుత వనరుల పురోగతి, సాధించాల్సిన ఆదాయ లక్ష్యాలపై మంత్రుల బృందం అధికారులకు దిశా నిర్దేశs చేసింది. ఈ భేటీకి కమిటీ సభ్యుడైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





