చిన్న పొరపాటుతో మీ ఖాతా ఖాళీ
» రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
» అప్రమత్తతే అసలైన రక్షణ
» ఓటీపీ, ఫేక్ లింకులు, క్యూఆర్ కోడ్లతో కొత్త ఎత్తుగడలు
» సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక!
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూలై 27 : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేయడం, ఓటీపీ అడగడం, క్యూఆర్ కోడ్ పంపించడం, ఫేక్ వెబ్ సైట్లు, నకిలీ ఉద్యోగాలు, ఆన్ లైన్ పెట్టుబడులు, సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్.. ఇలా ప్రతి రోజూ కొత్త తరహా మోసాలతో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చిన్న పొరపాటుకూ జీవితకాల పొదుపును కోల్పోయే పరిస్థితి. అందుకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
కొత్త రూపాల్లో సైబర్ మోసాలు
గతంలో బ్యాంకు వివరాలు అడిగే మోసాలు ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించడం, నకిలీ పెట్టుబడి యాప్ లు, పార్టమ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని మోసం చేయడం, కొరియర్ లేదా పోలీసుల పేరుతో బెదిరింపు కాల్స్ వంటి కొత్త పద్ధతులను నేరగాళ్లు ఉప యోగిస్తున్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత సురక్షితంగా ఉండగలరు. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు.. బ్యాంకు అధికారులు, పోలీసులు లేదా ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరూ ఫోన్లో ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, యూపీఐ పిన్ వంటి రహస్య వివరాలు అడగరు. అలాం టివి అడిగేవారు మోసగాళ్లేనని గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోకూడదు.
ఫేక్ లింకులు.. క్యూఆర్ కోడ్లు
తెలియని వ్యక్తులు పంపిన లింకులను ఓపెన్ చేయకూడదు. అలాగే డబ్బు అందుకోవ డానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవ సరం లేదని గుర్తుంచుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు అది ఎందుకు పంపిం చారో పూర్తిగా తెలుసుకోవాలి. అనుమా నాస్పద యాప్‌లను డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నకిలీ ఖాతాల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం, డబ్బులు పంపించడం, అనుమానాస్పద పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ తమ ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు, రెండు దశల భద్రతా చర్యలు ఉపయోగించాలి.
ప్రజల్లో అవగాహనే ఆయుధం
సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టాలంటే ప్రజ ల్లో అవగాహన పెరగడం అత్యంత అవసరం. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధు లు, విద్యార్థులు, కొత్తగా డిజిటల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వారికి ఈ విషయాలపై అవ గాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను గణనీయంగా తగ్గిం చవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
ఆలస్యం చేయొద్దు
సైబర్ మోసానికి గురైనా వెంటనే సమ యం వృథా చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలి. అలాగే
సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
మోసాలకు చెక్ పెట్టండి
– మహేష్ బి.గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలి. ఓటీపీ, యూ పీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరి తోనూ పంచుకోవద్దు. తెలియని లింకు లు, క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయవద్దు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీ డబ్బుకు రక్షణ.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





